Home Latest News పెళ్లికి రండి..  వెూడీకి ఓటేయండి..!

పెళ్లికి రండి..  వెూడీకి ఓటేయండి..!

మీరెవరైనా మీ కుమార్తె, కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికలో ఫలానా వారికి ఓటేయాలని చెప్పే సాహసం చేయగలరా? ముమ్మాటికీ చేయలేరు. కానీ సూరత్‌కు చెందిన ఓ ఆహ్వాన పత్రికలో సదరు ఆహ్వానితులు ఇలాంటి సాహసమే చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రధానిగా నరేంద్ర మోడీకి ఓటేయాలంటూ అతిథులకు సూచిం చారు.

మోడీ కి ఓటేయడమే మీరు నవదం పతులకు ఇచ్చే కానుక అంటూ పత్రిక కిందిభాగంలో ఈ మేరకు స్పష్టంగా అచ్చువేయించారు. ఇప్పుడు ఈ పత్రిక సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతు న్నాయి. దీనితోపాటు మంగళూరుకు చెందిన మరో మోడీ మద్దతుదారు అరుణ్‌ ప్రసాద్‌ సైతం ఇదేవిధంగా వ్యవహరించడం నెట్టింట టాక్‌ఆఫ్‌ద సైట్‌గా మారింది.

మరొక ఔత్సాహిక అభిమాని భూషణ్‌ బ్రాన్సన్‌ మరో అడుగు ముందుకేశారు. తన వెడ్డింగ్‌ కార్డుమీద ఎన్డీయే పథకాలు, సాధించిన విజయాలను ప్రత్యేకంగా ముద్రించాడు. మేం మోడీని కాపాడుకుంటాం. మోడీ దేశాన్ని కాపాడతాడు అని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పాడు. ఈ మేరకు ప్రధానికి ట్వీట్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదివరకు కొందరు స్వచ్‌భారత్‌ లోగోను తమ వెడ్డింగ్‌ కార్డులపై ముద్రించడం.. వారికి ప్రధాని రీట్వీట్‌ చేయడం చర్చనీయాంశం అయింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad