ఏపీ ప్రభుత్వం తనకు భద్రతను తగ్గించడంపై మాజీ సీఎం నారా చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్పై ఈ రోజు విచారణ జరగనుంది. కాగా, వైసీపీ ప్రభుత్వం నారా చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు రెండు దఫాలుగా భద్రతను కుదించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్చేస్తూ తనకు జూన్ 25వ తేదీకి ముందు ఉన్న భద్రతను పునరుద్దరించాలంటూ సీఎం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తనకు మావోయిస్టుల నుంచి ప్రమాదం పొంచి ఉందని, ఈ విషయాన్ని గత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా పేర్కొన్నాయంటూ చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా తన పిటిషన్లో ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీ, హోంశాఖ, గుంటూరు అర్బన్ పోలీసులు, భద్రత పునఃసమీక్ష కమిటీలను ప్రతివాదులుగా చేర్చారు.