Home Latest News మూడు భాగాలుగా విడిపోనున్న చిత్తూరు జిల్లా..!

మూడు భాగాలుగా విడిపోనున్న చిత్తూరు జిల్లా..!

ఏపీలో జిల్లాల‌ను పున‌ర్విభజించాల‌న్న డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. ఆ దిశ‌గా వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ప‌లుమార్లు ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి రావ‌డంతో కొత్త జిల్లాల అంశం తెర‌పైకి వ‌చ్చింది. కొత్త‌గా కొలువుతీరిన ప్ర‌భుత్వం జిల్లాల ఏర్పాట్ల‌పై ఫోక‌స్ పెట్టిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ఆయా జిల్లాల‌కు ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తుంది.

దీంతో చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం ప్ర‌ణాళిక సిద్ధంచేసి అమ‌రావ‌తికి పంపిన‌ట్టు స‌మాచారం. ప్ర‌తి పార్ల‌మెంట్ కేంద్రాన్ని జిల్లా చేస్తే చిత్తూరు జిల్లా మూడు భాగాలుగా విడిపోనుంది. అయితే, చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, మూడు పార్ల‌మెంట్ స్థానాలు ఉన్నాయి. చిత్తూరు పార్ల‌మెంట్ ప‌రిధిలోని చంద్ర‌గిరి, న‌గ‌రి, చిత్తూరు, గంగాధ‌ర నెల్లూరు, పూత‌ల‌ప‌ట్టు, ప‌ల‌మ‌నేరు, కుప్పం నియోజ‌క‌వ‌ర్గాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తార‌ని స‌మాచారం.

ఇక తిరుప‌తి పార్ల‌మెంట్ సెగ్మెంట్‌లో ఏడు జిల్లాలు ఉన్నాయి. మూడు తిరుప‌తి, మిగ‌తా నాలుగు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. తిరుప‌తి, శ్రీ‌కాళ‌హ‌స్తి, స‌త్య‌వేడు అసెంబ్లీలు చిత్తూరు జిల్లాలో ఉండ‌గా, స‌ర్వేప‌ల్లి, గూడూరు, సూళ్లూరుపేట‌, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాలు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మిగిలిన నాలుగు అసెంబ్లీ స్థానాలు క‌డ‌ప జిల్లా రాజంపేట పార్ల‌మెంట్ ప‌రిధిలో ఉన్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad