Home Latest News మళ్ళీ తన వక్రబుద్ధి చూపిన చైనా.. ఉగ్రదాడిని ఖండిస్తూనే.. !

మళ్ళీ తన వక్రబుద్ధి చూపిన చైనా.. ఉగ్రదాడిని ఖండిస్తూనే.. !

లోలోపల పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తూనే బయటకి మాత్రం ఏం ఎరగనట్లు కనిపిచే చైనా సందర్భం వచ్చిన ప్రతిసారి తన వక్రబుద్ది చూపిస్తుంటే ఉంది. ఇప్పటికె అమెరికా, రష్యా లాంటి దేశాలు “పుల్వామా ఉగ్రదాడి”ని ఖండిస్తే .. చైనా మాత్రం మాకు సంబందం లేదు అనేలా సైలెంట్ గా ఉంది.. చివరికి అందరూ స్పందించాక ఖండించాలి కాబట్టి అనేలా ఒక స్టేట్ మెంట్ ఇచ్చి.. దానికి మరో మెలికా పెట్టి తన వక్రబుద్దిని చూపించింది.

ఉగ్ర దాడిని ఓ వైపు ఖండిస్తూనే మరోపక్క భారత్ నాశనం కోరుకుంటుంది. అందులో బాగంగానే “భారత్‌ లో జరిగిన ఉగ్రదాడి చైనా దృష్టికి వచ్చింది.. ఈ దాడి ఘటన విని మేము తీవ్ర దిగ్భాంత్రికి గురయ్యాం.. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇలాంటి ఉగ్రవాదాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ఎప్పుడూ కృషి చేస్తాం” అని ఆ దేశ విదేశాంగ మంత్రి “గెంగ్‌ షుయాంగ్‌” మీడియా ద్వారా తెలిపారు.

అప్పుడే జైషే ఏ మహ్మద్‌ చీఫ్‌ “మసూద్‌ అజహర్‌”పై భారత్‌ నిషేధం విధించాలని చేస్తున్న డిమాండ్‌ పై మీ స్పందన ఏంటి..? అని మీడియా ప్రతినిధులు అతన్ని ప్రశ్నించారు. అందుకు షుయాంగ్‌.. “సెక్యూరిటీ కౌన్సిల్‌ జాబితాలో జేఈఎం కూడా ఉంది. ఈ విషయంలో ఆంక్షలు విధించేందుకు చైనా నిర్మాణాత్మకంగా, బాధ్యతాయుతమైన పద్ధతిని అవలంభిస్తోందని” సామదానం ఇచ్చాడు.

నిజానికి “ఐక్యరాజ్యసమితి”లో “మసూద్‌”ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి అతడిపై నిషేధం విధించాలని భారత్‌ పలుమార్లు ప్రతిపాదనలు చేసింది. ఈ విషయంలో మన భారత్‌ కు అగ్రరాజ్యం అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు మద్దతు పలికాయి. కానీ “ఐక్యరాజ్యసమితి” భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశంగా ఉన్న చైనా మాత్రం తిరస్కరిస్తూ వస్తోంది. ఏమన్నా అంటే “మసూద్‌” ఉగ్రవాది అనేందుకు భారత్ సరైన కారణాలు చూపించడం లేదని ఇష్యూను పక్కద్రోవ పట్టిస్తుంది చైనా.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad