Home Latest News విమానం నడిపే సమయంలో పైలట్ నిద్రపోతాడా ? : ఏం జరిగిందో చూడండి ?

విమానం నడిపే సమయంలో పైలట్ నిద్రపోతాడా ? : ఏం జరిగిందో చూడండి ?

విమానం నడిపే సమయంలో పైలట్ నిద్రపోతాడా ? అది సాద్యమేనా ? అంటే అసాధ్యం అంటారు. ఎందుకంటే ఫ్లైట్ అంటేనే ప్రాణాలు గాల్లో ఉన్నట్లు.. ఏ చిన్న పొరపాటు జరిగిన అందరి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. కాబట్టే విమానంలో పైలట్ అలాగే కో పైలట్లు ఎప్పుడు అలర్ట్ గా ఉంటారు. అంత బాధ్యతగల పైలట్ ఒకవేళా నిద్రపోతే ? మీరు విన్నది నిజమే ఇక్కడ ఒక పైలట్ ఘాడంగా నిద్రపోయాడు. అది చూసిన ప్రయాణికులు ప్రాణాల మీద ఆశలు వదులుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విమానం వేల అడుగుల ఎత్తులో ఉండగా “కాక్‌పిట్‌” లో కూర్చొని పైలట్‌ హాయిగా నిద్రపోయాడు. అయితే ఇక్కడ అదృష్టం ఏంటంటే విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చైనా ఎయిర్‌లైన్స్‌ కు చెందిన “బోయింగ్‌ 747” విమానం గాల్లో ఉండగానే సీనియర్‌ పైలట్‌ ఆదమరిచి నిద్రపోయాడు. అతడికి విమానం నడపడంలో 20 ఏళ్ల అనుభవం ఉందని ఎయిర్‌లైన్స్‌ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ప్రమాదం ఏమి జరగనప్పటికి ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ పైలట్‌ తో పాటు, కో పైలట్ ను కూడా విధుల నుంచి తప్పించారు.

కో పైలట్ ని కూడా ఎందుకు విధులనుండి తప్పించారో తెలుసా ? తన సీనియర్ పైలట్ నిద్రిస్తే అతడిని లేపాల్సింది పోయి ఆ తతంగం అంత వీడియో తీసి నెట్ లో పెట్టాడు. దాంతో అతడికి కూడా వేటు వేశారు ఎయిర్‌లైన్స్‌ అధికారులు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇద్దరిదీ తప్పే, ఎయిర్‌లైన్స్‌ అధికారులు చేసింది 100 శాతం కరెక్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. దాంతో ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad