Home Latest News వైఎస్ జ‌గ‌న్ : మ‌రో సినిమాలో చంద్ర‌బాబుది విల‌న్ పాత్ర‌..!

వైఎస్ జ‌గ‌న్ : మ‌రో సినిమాలో చంద్ర‌బాబుది విల‌న్ పాత్ర‌..!

వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ కాసేప‌టి క్రితం తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ అయ్యారు. భేటీలో భాగంగా పోలింగ్ రోజు,, ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల గురించి వైఎస్ జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఏపీలో టీడీపీ అరాచ‌కాలు సృష్టిస్తోంద‌ని ఈసీకి వైసీపీ నేత‌ల బృందం ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అనంత‌రం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి మాట్లాడుతూ సీఎం చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏప్రిల్ 11న జరిగిన సార్వ‌త్రిక ఎన్నికల్లో 80 శాతం మంది జ‌నాభా వారి ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డం టీడీపీపై ఉన్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని వైఎస్ జ‌గ‌న్ అన్నారు. అదే 80 శాతం మంది ప్ర‌జ‌లు పోలింగ్ బూత్‌లో ఓటు వేసేందుకు వెళ్లి వారికి న‌చ్చిన పార్టీకి సంబంధించిన గుర్తు బ‌ట‌న్‌ను నొక్కారు.. బ‌ట‌న్ నొక్కిన త‌రువాత వాళ్లు ఏ పార్టీకి ఓటేశారన్న‌ది వీవీ ప్యాట్‌లో క‌నిపిస్తుంది. వాళ్లు వేసిన ఓటు,. వీవీ ప్యాట్‌లో వారికి క‌నిపించే ఓటు రెండూ మ్యాచ్ అయ్యాయి కాబ‌ట్టే వాళ్లు సంతృప్తి చెంది పోలింగ్ బూత్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌న్నారు.

అలా వారి వారి ఓటును స‌ద్వినియోగం చేసుకున్న 80 శాతం మంది ఎవ్వ‌రూ కూడా వీవీ ప్యాట్‌ల‌పై, ఈవీఎంపై, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌లేద‌న్నారు. ఇవ‌న్నీ చంద్ర‌బాబుకు తెలిసి తాను ఓవ‌రికి ఓటేశాడో త‌న‌కే తెలీయ‌ద‌ని చెప్పి, ఒక సినిమాలో విల‌న్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయ‌డం ఎంత వ‌ర‌కు ధ‌ర్మ‌మ‌ని జ‌గ‌న్ చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad