దేశ వ్యాప్తంగా అనేకమంది రాజకీయ నాయకులు బీజేపీలో చేరాలని ఉత్సాహం చూపుతున్నారని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీలో చేరికలు పెద్ద స్థాయిలో ఉంటాయని గతంలో బీజేపీ చెప్పిన విషయాన్ని జీవీఎల్ మరోసారి గుర్తు చేశారు.
ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరికలు పెగడానికి ముఖ్య కారణం కళ్ల ముందు కనపడుతున్న దేశ అభివృద్ధే అని జీవీఎల్ అన్నారు. 2024లోను కూడా బీజేపీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. ఏపీ టీడీపీకి ఇక రాజకీయ భవిష్యత్తు లేదు.. చంద్రబాబుతో కలిసి ఉండటమంటే మరోసారి ఓటమికి నాంది పలకడమే అనుకున్న వారంతా బీజేపీవైపు చూస్తున్నారని ఆయన చెప్పారు.