Home Latest News రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది.. నాది 8 ఏళ్ల ప్రేమా అంటూ..!

రెచ్చిపోయిన మరో ప్రేమోన్మాది.. నాది 8 ఏళ్ల ప్రేమా అంటూ..!

ఈమధ్య ప్రేమోన్మాదుల దాడులు ఎక్కువవుతున్నాయ్.. మీడియాలో వస్తున్న వార్తలు చూసి రెచ్చిపోతున్నారో లేక పబ్లిసిటీ తోపాటు తమ పగ కుడా తీరుతుంది అనుకుంటున్నారో ఏమో కాని ప్రేమోన్మాదుల దాడులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మొన్న మంగళగిరి జ్యోతి, నిన్న మధులిక నేడు మరో జ్యోతి.. కూతురు వయసులో ఉన్న జ్యోతి(20) అనే యువతితో సత్యనారాయణ (40) అనే నీచుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా జ్యోతి మరో వ్యక్తితో చనువుగా ఉంటుందని చివరికి ఆమెను హత్యా చేసాడు ఆ దుర్మార్గుడు.

ఈ ఘటన జరిగి కొన్ని గంటలు కుడా కాలేదు మరో ప్రేమోన్మాది ప్రేమ పేరుతో ఓ యువతిపై దాడి చేసాడు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌ కు చెందిన నస్పూరి శ్రీనివాస్‌(29) అనే వ్యక్తి అదే కాలనీకి చెందిన యువతిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. 8 ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పిన శ్రీనివాస్.. గురువారం సాయంత్రం ఆమెకు హోటల్‌కు వెళ్దాం అని చెప్పి బయటకు తీసుకెళ్ళాడు.

కాని చివరికి హోటల్ కి కాకుండా మరో స్థలానికి తీసుకెళ్ళాడు. దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ గొడవలో ఆవేశానికి లోనైనా శ్రీనివాస్‌ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది. దాంతో శ్రీనివాస్‌ అక్కడ నుంచి పరారయ్యాడు. అది గమనించిన స్థానికులు ఆమెను వెంటనే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఎన్టీపీసీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI ఆంజనేయులు తెలిపారు. ప్రస్తుతం బాదితురాలు పరిస్థితి నిలగాడగానే ఉందని తెలుస్తుంది. నిందితుడు శ్రీనివాస్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad