భారతదేశం మొత్తం ప్రస్తుతం “పుల్వామా ఉగ్రదాడి” గురించే చేర్చించుకుంటుంది. ఇన్నాళ్ళు శాంతి శాంతి అని కూర్చుంటే దాన్నే ఆయుధంగా మలుచుకుంటున్న పాకిస్తాన్ మనపై, మన సైనికులపై అటాక్ చేస్తూనే ఉంది. ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటూనే ఉంది. అందులో బాగంగానే ఇప్పుడు “పుల్వామా ఉగ్రదాడి” చేయించింది పాకిస్తాన.
పైగా అతితెలివి ప్రదర్శిస్తూ.. బయటకి మాత్రం ఆ దాడికి మాకు ఎలాంటి సంబందం లేదు అని స్టేట్ మెంట్ ఇచ్చేస్తు.. లోలోపల ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది పాకిస్తాన్.. పైగా మన కుర్రల్లనే ఉద్రవాదులు మార్చి, మనపైకే వదులుతుంది. ఇలా రెండు రకాలుగా మనమే నష్టపోతున్నాం కానీ పాకిస్తాన్ కి మాత్రం ఎలాంటి నష్టం లేదు.
అందుకే సమయం చిక్కినప్పుడల్లా మనపై దాడి చేస్తూనే ఉంది పాక్.. దానికి ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తుంది భారత్.. అందులో బాగంగానే ప్రదాని మోది ఇప్పటికే భారత సైనికులకు పూర్తి స్వేచ్చా ఇచ్చేశారు.. ఎటాక్ ఎలా ? ఎప్పుడు చేద్దాం ? సమయం, ప్రదేశం చెప్పండి చాలు పర్మిషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దం అని ఆదేశాలు ఇచ్చేశాడు మోధి.
అందుకు సంబందించిన ఆపరేషన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో భారత్ కు మరో చేదు వార్తా వినాల్సి వచ్చింది. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన పనికి మరో సైనికుడు వీరమరణం పొందాడు. శనివారం “నౌషరా సెక్టార్” సమీపంలోని “ఎల్ఓసీ” వెంబడి అమర్చిన “IED” నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మేజర్ ర్యాంక్ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ కు చెందిన చొరబాటుదారులు ఈ “IED”ని ఏర్పాటు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.