టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజమౌళికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. ఆ వీడియోలో రాజమౌళి రాజకీయాలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు. అయితే, ఆ వీడియోను పరిశీలిస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్సత్తా తరుపున ప్రచారం చేసే సమయంలో రాజమౌళి ప్రసంగంలా ఉందని నెటిజన్లు చెబుతున్నారు. ఇక ఆ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ ఇలా అన్నారు..
నాకు తెలిసినవి రెండే విషయాలు. ఒకటి నా భారత దేశం నెంబర్ వన్ పొజీషన్లో ఉండాలి. అన్ని రంగాల్లో ముందుండాలంటే ఏం చేయాలి..? ఎలా చేయాలి అని చెప్పగలిగే వ్యక్తి ఉండాలి. కానీ, ఈ మధ్యన మూడు, నాలుగు సంవత్సరాల నుంచి భయమేస్తోంది. దానికి కారణం ఈ రాజకీయ నాయకులే.
ఇంతకు ముందు రాజకీయ నాయకులు తప్పు చేస్తే సిగ్గుపడేవారు. భయపడే వారు. దొంగతనంగా తిరిగే వారు. లంచాలు తీసుకుంటే ఎవరికి కనపడకుండా బయటకొచ్చేవారు. ఆ పరిస్థితుల్లో ప్రజలు వారిని వదిలేసి చిన్న చిన్న వారినే దొంగలంటున్నారు. పెద్ద పెద్ద దొంగలను మాత్రం హీరోలంటున్నారు. అది నాకు చాలా భయమేస్తుంది.
అంటే ఎక్కువ దోచుకునే వాళ్లపై ప్రజలకే కోపం లేకుంటే ఎలా..? కోపం ఉంటే వాళ్లను కొట్టో.. తిట్టో.. లేదదంటే వాళ్ల మీద కేసులు పెట్టో.. లేకుండే ఓట్లు వేయకుండానో కోపం చూపిస్తారు. కానీ వాళ్ల మీదనే ప్రజలకు కోపం లేకుండా, ఎన్నికల్లో ఓట్లు వేస్తే ఎలా..? అని భయమేస్తుంది అంటూ రాజమౌళి అన్నారు.