సోషల్ మీడియా వేదికగా ఇతరులను కించపరుస్తూ పోస్టులు చేస్తున్నవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తమను ఇబ్బందులకు గురిచేసేలా గుర్తు తెలియని వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఫిర్యాదులు అందితే చాలు వెంటనే పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ హోం మినిస్టర్ సుచరితపై ఫేస్బుక్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడులు జరిగిన ప్రతిచోటా భద్రత పెట్టలేమని, దాడులకు గురైన వారు ఫిర్యాదు చేస్తే ఆమె చేసిన ప్రకటనపై విశాఖపట్నంకు చెందిన యువకుడు రామ్ మహరాజ్ అసభ్యకరంగా పోస్టులు పెట్టాడు. గుంటూరు పట్టాభిపురం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తిని కించపరిచే విధంగా వ్యవహరించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పీఓఏ యాక్ట్ ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.