ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులను ప్యాకెట్ల రూపంలో వాలెంటీర్లతో ఇంటికి చేరవేయాలని సంకల్పించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఇప్పటికే వాలెంటీర్లను జగన్ ప్రభుత్వం సిద్ధం చేసింది. అందులో భాగంగా వాలెంటీర్ నియామకం కోసం నోటిఫికేషన్ను విడుదల చేసి నియామక ప్రక్రియను వేగవంతం చేస్తుండటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
కాగా, రేషన్ ప్రజల నిత్యవసరాల కోసం డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్న సరుకులు అత్యధికంగా పక్కదారి పడుతుందని, వాలెంటీర్ల ద్వారా రేషన్ సరుకులను ఇంటికి చేరవేస్తే వినియోగమవుతాయన్న ది ప్రభుత్వ ఉద్దేశంగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత రేషన్ డీలర్ల వ్యవస్తను జగన్ ప్రభుత్వం తొలగించనున్నట్టు ప్రచారం జరుగుతుంది.
వాలెంటీర్ల నియామకం తరువాత డీలర్ వ్యవస్థ అవసరం లేదన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం ఉందనే సంకేతాలు డీలర్లకు అందడంతో వ్యవస్థ మొత్తం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే సీఎం జగన్ను పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నానిని డీలర్ల సంఘాలు వారి వారి ఆవేదనను వెల్లిబుచ్చిన సంగతి తెలిసిందే.