ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. తిరుపతి సుందరయ్య కాలనీలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డారు. పోలీసులు వారిని అరెస్టు చేసి లక్ష రూపాయల వరకు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాజాం జెండాల దిబ్బ జంక్షన్లో పోలీసులు తనిఖీలు చేస్తుండగా బ్యాగుల్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఓ పార్టీకి చెందిన కార్యకర్త నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
విశాఖలోనూ ఇదే పరిస్థితి. పాలకొండ ఆర్టీసీ బస్సులో మూడు బాక్సుల్లో పోలీసులు డబ్బులను గుర్తించారు. నగదు బాక్స్‌ను డ్రైవర్ క్యాబిన్లో ఉంచి తరలిస్తుం డగా పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ సమక్షంలో నోట్ల కట్లను లెక్కిస్తున్నారు. నగదు ఐదు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. నగల వ్యాపారి అనీల్ అగర్వాల్ ఇంట్లో రూ.3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో అభ్యర్ధులకు ఇచ్చేందుకు ఈ నగదును దాచినట్టుగా పోలీసులు గుర్తించారు.