Home Latest News ఏపీ లేటెస్ట్ స‌ర్వే : ల‌గ‌డ‌పాటి లెక్క‌లు త‌ప్పినా.. ఈయ‌న లెక్క‌ల్లో అంకె కూడా మార‌దు..!

ఏపీ లేటెస్ట్ స‌ర్వే : ల‌గ‌డ‌పాటి లెక్క‌లు త‌ప్పినా.. ఈయ‌న లెక్క‌ల్లో అంకె కూడా మార‌దు..!

తెలంగాణ రెండో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘోర‌మైన అప‌జ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంటుంది.. టీడీపీ, కాంగ్రెస్‌, టీజేఎస్‌, సీపీఐ ఆధ్వ‌ర్యంలోని మ‌హాకూట‌మి 80కు పైగా అసెంబ్లీ సీట్ల‌ను ద‌క్కించుకుని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాయంటూ ఏపీ ఆక్టోప‌స్‌గా పేరొందిన ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ త‌న స‌ర్వేను వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. కానీ, ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఆ స‌ర్వే డ‌మ్మీ అని తేలిపోయింది. ల‌గ‌డ‌పాటి చెప్పిన లెక్క‌ల‌కు కాసింత ద‌గ్గ‌ర‌లో కూడా ఆ స‌ర్వే అంచ‌న వేయ‌లేక‌పోయింది. దీంతో ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై ఆసక్తి క‌న‌బ‌రిచే వారి సంఖ్య రోజు రోజుకు త‌గ్గుతూ వ‌స్తోంది.

ఇదే స‌మ‌యంలో తెలంగాణ‌కు చెందిన సెఫాల‌జిస్ట్ నాగ‌న్న అండ్ టీమ్ చేసే స‌ర్వేల‌పై పొలిటిక‌ల్ ఎన‌లిస్టుల‌కు రోజు రోజుకు ఆస‌క్తిమ‌రింత పెరుగుతోంది. దీనికి కార‌ణం గ‌తంలో జ‌రిగిన మూడు ఎన్నిక‌ల్లో నాగ‌న్న అండ్ టీమ్ చెప్పిన ఫ‌లితాలే రివీల్ కావ‌డం, అంకెకు అంకె ఎటువంటి తేడా లేకుండా నాగ‌న్న స‌ర్వే లెక్క‌లు నిజ‌మ‌య్యాయి.

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోతుంద‌ని ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వే చెప్తే.. నాగ‌న్న అండ్ టీమ్ మాత్రం టీఆర్ఎస్ 65 నుంచి 75 సీట్ల‌ను గెలుపొందుతుంద‌ని, బీజేపీ కేవ‌లం ఒక్క సీటు మాత్ర‌మే సాధిస్తుంద‌ని చెప్పారు. నాగ‌న్న చెప్పిన‌ట్టే టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టింది. అలాగే తెలంగాణ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ నాగ‌న్న స‌ర్వే చెప్పిన విధంగా టీఆర్ఎస్ 98 నుంచి 100 సీట్లను గెలుపొందింది. దీంతో నాగ‌న్న స‌ర్వే అవుట్‌పుట్‌పై రాజ‌కీయ విశ్లేష‌కుల్లో అమాంతం ఆస‌క్తిరేగుతోంద‌ని చెప్పొచ్చు. అటువంటి నాగ‌న్న త‌న టీమ్‌తో తాజాగా ఏపీలో స‌ర్వే నిర్వ‌హించారు. ఒక‌టికి మూడుసార్లు చేసిన ఈ స‌ర్వేలోని లెక్క‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

## అనంత‌పురంలో మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 14

తెలుగుదేశం : 6
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 4
పోటా పోటీగా ఉండే స్థానాలు : 4

## చిత్తూరు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 14

తెలుగుదేశం : 1
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 13
పోటా పోటీగా ఉండే స్థానాలు : 0

## తూర్పు గోదావ‌రి మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య‌ 19

తెలుగుదేశం : 5
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 7
పోటా పోటీగా ఉండే స్థానాలు : 7

## గుంటూరు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 17

తెలుగుదేశం : 4
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 10
పోటా పోటీగా ఉండే స్థానాలు : 3

## క‌డ‌ప మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 10

తెలుగుదేశం : 1
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 8
పోటా పోటీగా ఉండే స్థానాలు : 1

## కృష్ణా మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య‌ 16

తెలుగుదేశం : 12
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 4
పోటా పోటీగా ఉండే స్థానాలు : 0

## క‌ర్నూలు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 14

తెలుగుదేశం : 2
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 9
పోటా పోటీగా ఉండే స్థానాలు : 3

## నెల్లూరు మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 10

తెలుగుదేశం : 0
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 8
పోటా పోటీగా ఉండే స్థానాలు : 2

## ప్ర‌కాశం మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 12

తెలుగుదేశం : 1
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 9
పోటా పోటీగా ఉండే స్థానాలు : 2

## శ్రీ‌కాకుళం మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య‌ 10

తెలుగుదేశం : 1
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 9
పోటా పోటీగా ఉండే స్థానాలు : 0

## విశాఖ‌లో మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 15

తెలుగుదేశం : 8
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 5
పోటా పోటీగా ఉండే స్థానాలు : 2

## విజ‌య‌న‌గ‌రం మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 9

తెలుగుదేశం : 4
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 5
పోటా పోటీగా ఉండే స్థానాలు : 0

## ప‌శ్చిమ గోదావ‌రి మొత్తం అసెంబ్లీ నియోజక‌వ‌ర్గాల సంఖ్య 15

తెలుగుదేశం : 4
వైఎస్ఆర్ కాంగ్రెస్ : 8
పోటా పోటీగా ఉండే స్థానాలు : 3

నాగ‌న్న అండ్ టీమ్ స‌ర్వే లెక్క‌ల ప్ర‌కారం :

వైసీపీ మొత్తంగా 99 నుంచి 110 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుపొంద‌నుంది.
టీడీపీ మొత్తంగా 49 నుంచి 59 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుపొంద‌నుంది.

వైసీపీ, టీడీపీ ఇరు పార్టీల మ‌ధ్య పోటా పోటీ ఉండే స్థానాల్లో వైసీపీ 12, టీడీపీ 15 స్థానాల‌ను గెలుపొందే అవ‌కాశం ఉంద‌ని నాగ‌న్న అండ్ టీమ్ స‌ర్వే వెల్ల‌డించింది. అలాగే నాగ‌న్న టీమ్ స‌ర్వేలో జ‌న‌సేన‌కు, కాంగ్రెస్‌కు, బీజేపీకి ఎటువంటి గెలుపు అవ‌కాశాలు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad