Home Latest News ఒకపక్క ఆనందం మరో పక్క భయం భయం.. YCPలోకి మరో టీడీపీ MLA జంప్..!

ఒకపక్క ఆనందం మరో పక్క భయం భయం.. YCPలోకి మరో టీడీపీ MLA జంప్..!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలవారికి అనుకూలంగా ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై ప్రభుత్వం ఆనందంగా ఉంది. ఎలాగైనా ఈ బడ్జెట్ వచ్చే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపిస్తుంది అని చంద్రబాబు నమ్మకం, కానీ మరో పక్క చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి ? అనే ప్రశ్న బలపడుతుంది.

ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యే లు ఒకొక్కరు వేరే పార్టీలకు జంప్ అవుతూ పార్టీకి భారీ షాక్ లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా చీరాలలో కూడా రాజకీయాలు వేడెక్కాయి. స్థానిక ఎమ్మెల్యే “ఆమంచి కృష్ణమోహన్” గారు సైతం అతి త్వరలోనే YCPలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు అభిమానులు కార్యకర్తలతో “ఆమంచి కృష్ణమోహన్”, పందిళ్లపల్లిలోని తన ఇంట్లో భేటీ అయ్యారని తెలుస్తుంది.

ఈ భేటీలో పార్టీ మార్పు ఫై కార్యకర్తలతో చర్చించారని, కార్యకర్తల నుండి కూడా అనుకూలత రావడంతో పార్టీ మారడంవైపే మొగ్గు చూపుతున్నాడని తెలుస్తుంది. పార్టీ మార్పు పై నిర్ణయాన్నీ అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అందుకు ప్రకాశం జిల్లాలో జరిగే “వైసీపీ సమర శంఖం” సభ వేదిక కానుందని తెలుస్తుంది. ఈ నెల 13న జరిగే ఈ సభ వేదికగానే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ లో చేరతారని తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad