Home Latest News వైఎస్ జ‌గ‌న్ : ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే మరో సంచ‌ల‌న నిర్ణ‌యం..!

వైఎస్ జ‌గ‌న్ : ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందే మరో సంచ‌ల‌న నిర్ణ‌యం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ముందు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే, ఏప్రిల్ 11న ఏపీ వ్యాప్తంగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ శ్రేణులు ఆచితూచి అడుగులు వేసిన సంగ‌తి తెలిసిందే. 2014 ఎన్నికల్లో జ‌రిగిన పొర‌పాట్ల‌ను నెమరువేసుకుంటూ, అవే మ‌ళ్లీ పున‌రావృతం కాకుండా, మ‌ళ్లీ కొత్త పొర‌పాట్ల‌కు చోటు ఇవ్వ‌కుండా, అన్ని విధాలా జాగ్ర‌త్త‌లు పాటించారు.

ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జ‌రుగుతుంద‌న‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్ది అన్ని నియోకవ‌ర్గాల ఎమ్మెల్యే అభ్య‌ర్ధుల‌తోటి, అలాగే పోలింగ్ బూత్‌ల‌కు సంబంధించి పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. పోలింగ్ స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధ పార్టీలు రిగ్గింగ్‌కు పాల్పడే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, అటువంటి స‌మ‌స్యే గ‌నుక ఎదురైతే ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్త‌మై ఆ ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఆధారాల‌ను సేక‌రించాల‌ని సూచించారు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశానుసారం వైసీపీ కార్య‌క‌ర్తులు, నాయ‌కులు ఎన్నిక‌ల వేళ అన్ని విధాల కృషి చేశారు. ప్ర‌త్య‌ర్ధ పార్టీలు చేస్తున్న అన్ని కుట్ర‌ల‌ను వీడియోల‌తో స‌హా సోష‌ల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోలే ఇప్పుడు ప్ర‌త్య‌ర్ధ పార్టీల‌పై ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు వైసీపీకి ఉపయోగ‌ప‌డ్డాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇలా నాడు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం ఎంతో ఉప‌యోగ‌ప‌డింద‌ని, మ‌ళ్లీ అటువంటి వ్యూహాత్మ‌క నిర్ణ‌యాన్నే ఈవీఎంల‌లోని ఓట్ల కౌంటింగ్ వేళ వైఎస్ జ‌గ‌న్ అమ‌లు చేయ‌నున్నార‌న్న‌ది తాజా స‌మాచారం. ఏప్రిల్ 11న చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు మ‌ళ్లీ తావివ్వ‌కుండా ఈవీఎంల కౌంటింగ్ స‌జావుగా జ‌రిగేలా స‌హక‌రిస్తూనే, ప్ర‌త్య‌ర్ధ పార్టీల కుట్ర‌ల‌ను తిప్పి కొట్టాల‌ని వైసీపీ శ్రేణుల‌కు ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad