Home Latest News పాద‌యాత్ర ముగియ‌గానే జ‌గ‌న్‌కు పొంచి ఉన్న మ‌రో ప్ర‌మాదం..!

పాద‌యాత్ర ముగియ‌గానే జ‌గ‌న్‌కు పొంచి ఉన్న మ‌రో ప్ర‌మాదం..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి మ‌రో ప్ర‌మాదం పొంచి ఉంది. టీడీపీ నేత‌లు ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఆ ప్ర‌మాదం జ‌ర‌గ‌నుంది. వైఎస్ జ‌గ‌న్‌పై జ‌ర‌గ‌బోతున్న ఆ దాడిని ఏపీ ప్ర‌జ‌లంతా క‌లిసిక‌ట్టుగా ఎదుర్కోవాల‌ని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. కాగా, జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు సంద‌ర్భంగా ఏర్పాటు చేయ‌నున్న బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు ఇచ్ఛాపురం వ‌చ్చిన ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.

వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై ఆర్కే రోజా మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో వైఎస్ జ‌గ‌న్‌లా పాద‌యాత్ర ఎవ‌రూ చేయ‌లేద‌ని, ఇక పుట్ట‌ర‌ని పేర్కొంది. ఏ ఒక్క రోజు కూడా ఎండా, వాన, చ‌లి ఇలా దేన్నీ లెక్క చేయ‌కుండా, ఆఖ‌ర‌కు సెక్యూరిటీని కూడా ప‌ట్టించుకోకుండా, త‌న‌తో క‌లిసి న‌డిచిన ప్ర‌తీ ఒక్క‌రి చేయి ప‌ట్టుకుని న‌డిచార‌న్నారు. రైత‌న్న‌లు, డ్వాక్రా మ‌హిళ‌లు, యువ‌త‌, చిన్న పిల్ల‌లు ఇలా ప్ర‌తీ ఒక్క‌ర్నీ జ‌గ‌న్ త‌న ఇంటి మ‌నిషిలా చాలా ఆప్యాయంగా ప‌లుక‌రించార‌న్నారు. ఈ ఏడాది జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల త‌రువాత వైసీపీ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్లీ రాజ‌న్న ప్ర‌భుత్వాన్ని తీసుకురావాల‌న్న ఆశ‌యాల‌తోనే జ‌గ‌న్ ఉన్నార‌ని, అలాగే జ‌గ‌న్‌ను కూడా ప్ర‌జ‌లు అదే స్థాయిలో న‌మ్ముతున్నార‌ని రోజా తెలిపింది.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ఇటీవ‌ల విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జ‌గ‌న్‌పై శ్రీ‌నివాస‌రావు అనే వ్య‌క్తి కోడిక‌త్తితో దాడి చేసిన సంగ‌తి తెలిసిందే. అదే రీతిలో వైఎస్ జ‌గ‌న్‌పై మ‌రో దాడి జ‌ర‌గ‌నుంద‌ని రోజా మీడియాతో చెప్పుకొచ్చారు. అది కూడా తిరుమ‌ల‌లో వెల‌సి ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి స‌న్నిధానంలోనేన‌ని తెలిపారు. వైఎస్ జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ముగియ‌గానే శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని ద‌ర్శించుకోనున్నార‌ని, ఆ క్ర‌మంలోనే టీడీపీ నేత‌లు త‌మ కార్య‌క‌ర్త‌ల ద్వారా జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించార‌న్నారు. జ‌గ‌న్‌పై టీడీపీ కుట్ర‌ల‌ను తిప్పికొట్టేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాల‌ని ఆర్కే రోజా మీడియా ద్వారా పిలుపునిచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad