Home Latest News అనీల్ కుమార్ యాదవ్ .. అలా అయితే స‌లామ్ కొట్టాల్సిందే..!

అనీల్ కుమార్ యాదవ్ .. అలా అయితే స‌లామ్ కొట్టాల్సిందే..!

ఈ నెల 23న వెలువ‌డ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిల ఫ‌లితాలు త‌మ‌కు అనుకూలంగా వ‌స్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి నమ్మ‌కంగా ఉన్నారు. విజ‌యం త‌మ‌దేన‌ని ధీమాతో ఉన్న వైసీపీ ముఖ్య నేత‌లు, జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా, వైసీపీ అధికారంలోకి వ‌స్తే ఏర్ప‌డ‌బోయే కేబినేట్‌లో త‌మ‌కు చోటు ద‌క్క‌డం ఖాయ‌మంటూ ఎవ‌రికి వారు లెక్క‌లు వేసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయ‌డం ఖాయ‌మంటూ వినిపిస్తున్న నెల్లూరు జిల్లా నుంచి మంత్రి ప‌ద‌వి ఎవ‌రిని వ‌రిస్తుందోన‌న్న ప్ర‌శ్న ఇప్పుడు రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ క్ర‌మంలో దివంగ‌త సీఎం వైఎస్ఆర్ కేబినేట్‌లో మంత్రిగా ప‌నిచేసిన ఆనందం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. ఆయ‌న సేవ‌ల‌ను జ‌గ‌న్ ఉప‌యోగించుకుంటారంటూ రాజకీయ‌వ‌ర్గాల్లో ముమ్మ‌రంగా ప్ర‌చారం కొన‌సాగుతోంది.

మ‌రోపక్క‌, పార్టీ స్థాప‌న నుంచి వైఎస్ జ‌గ‌న్‌నే త‌మ నేత‌గా భావించి, పార్టీకి సేవ‌లందిస్తూ వ‌స్తున్న త‌మ‌కు క‌చ్చితంగా జ‌గ‌న్ న్యాయం చేస్తాడ‌ని మ‌రికొంత మంది పూర్తి విశ్వాసాన్ని చూపుతున్నారు. ఈ త‌రుణంలో నెల్లూరు టౌన్ వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాద‌వ్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

కాగా, ఈ ద‌ఫా జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ అనీల్ కుమార్ యాద‌వ్ నెల్లూరు టౌన్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఐదేళ్ల‌లో నెల్లూరు ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు ఎన‌లేని సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన ఆయ‌న మ‌ళ్లీ గెలుపు సాధించ‌డం ప‌క్కా అన్న న‌మ్మ‌కాన్ని ఆ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో వ్య‌క్తం చేస్తున్నాయి.

మ‌రోప‌క్క‌, ఏపీ మంత్రిగానే కాకుండా, ఆర్థికంగా బ‌ల‌మున్న నారాయ‌ణ‌తో ఈ సారి అనీల్ కుమార్ యాద‌వ్ త‌ల‌ప‌డ్డారు. ఇద్దరూ త‌ల‌ప‌డ‌టంతో నెల్లూరు ప‌ట్ట‌ణం శాస‌న స‌భ స్థానంలో పోటీ హోరా.. హోరీగానే సాగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. మే 23న వెలువ‌డ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత అనీల్ కుమార్ యాద‌వ్ మ‌రోమారు ఎమ్మెల్యేగా గెలుపొందితే, సామాజిక ప‌రిణామాల నేప‌థ్యంలో వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న కేబినేట్‌లో అనీల్ కుమార్ యాద‌వ్‌కు కీల‌క మంత్రి ప‌ద‌వి కేటాయిస్తారన్న ప్ర‌చారం విస్తృతంగా జ‌రుగుతోంది.

అయితే, త‌న‌కు వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి మంత్రి ప‌ద‌వి కేటాయించ‌నున్నారంటూ సోష‌ల్ మీడియాలో విస్తృతంగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై అనీల్ కుమార్ యాద‌వ్ స్పందించారు. గ‌తంలో జ‌రిగిన పార్టీ కార్య‌క్ర‌మాల్లో అనేక మార్లు తాను చెప్పిన మాట‌ను అనీల్ కుమార్ గుర్తు చేశారు. అదేమాట‌ను ఆయ‌న మ‌రోమారు గుర్తు చేశారు. త‌న కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్‌తోనే ఉంటాన‌ని, త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇచ్చినా, ఇవ్వ‌కున్నా వైసీపీనే త‌న శ్వాస‌గా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad