తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేబినేట్లో పది మంది సభ్యులు మరికొద్దిసేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ నగర పరిధిలోగల రాజ్‌భవన్ వేదిక కానుంది. కేసీఆర్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న వారిలో నలుగురు మాజీ మంత్రులు ఉండగా, మరో ఆరుగురు తొలిసారి మంత్రి పదవులు చేపట్టనున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు కేసీఆర్ కేబినేట్లో చోటు దక్కించుకోనున్న వారి పేర్లు ఇలా ఉన్నాయి. ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ఉన్నట్లు సమాచారం.
కాగా, హైదరాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు మరోసారి పశు సంవర్ధకశాఖ, సినిమాటోగ్రఫీ శాఖలనే కేటాయించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో టీడీపీ నుంచి గెలిచి గత టీఆర్ఎస్ కేబినేట్లో మంత్రిగా చేశారు. ఈ సారి టీఆర్ఎస్ తరుపున మళ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తలసానికి జంట నగరాల కోటా, బీసీ కోటాలో బెర్త్ ఖాయమైంది. హైదరాబాద్‌లో విపక్షాలకు కౌంటర్ ఇచ్చే నాయకుడిగా కేసీఆర్‌కు విధేయుడిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు తెచ్చుకున్నారు.