Home Latest News జ‌న‌సేన‌తో పొత్తు - లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే జిల్లాలివే..!

జ‌న‌సేన‌తో పొత్తు – లెఫ్ట్ పార్టీలు పోటీ చేసే జిల్లాలివే..!

ఏపీ వ్యాప్తంగా మ‌రికొన్ని నెల‌ల్లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న క్ర‌మంలో జ‌న‌సేన‌, వామ‌ప‌క్ష పార్టీల మ‌ధ్య పొత్తుపై తొలి అడుగు ప‌డింది. అయితే, లెఫ్ట్‌పార్టీల‌తో క‌లిసి వెళ్తామ‌ని జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అందులో భాగంగా జ‌న‌సేన‌, సీపీఎం, సీపీఐ పార్టీల మ‌ధ్య పొత్తుల‌కు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. పొత్తుల‌పై చ‌ర్చించేందుకు ఇవాళ సీపీఎం రాష్ట్ర కాద‌ర్శి మ‌ధు, సీపీఐ రాష్ట్ర కార్య‌వ‌ర్శి రామ‌కృష్ణ విజ‌య‌వాడ‌లోని జ‌న‌సేన కార్యాల‌యానికి చేరుకున్నారు.

అనంత‌రం జ‌న‌సేన ముఖ్య నేత నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో మ‌ధు, రామ‌కృష్ణ‌లు భేటీ అయ్యారు. సుమారు గంట‌పాటు ఆయ‌న‌తో నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో వారు చ‌ర్చించారు. అంతేకాకుండా మ‌రికాసేప‌ట్లో ప‌వ‌న్‌తోనూ వామ‌ప‌క్ష నేత‌లు స‌మావేశం కానున్నారు. ఇందుకోసం నాదెండ‌ల్ మ‌నోహ‌ర్ వారిని వెంట‌బెట్టుకుని మ‌రీ ప‌వ‌న్ వ‌ద్ద‌కు వెళ్లారు.

అయితే, వీలైనంత త్వ‌ర‌గా పొత్తులు, సీట్ల కేటాయింపులు పూర్తి చేసుకోవాల‌ని జ‌న‌సేన లెఫ్ట్ పార్టీలు భావిస్తున్న‌ట్లుగా తెలుస్తుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇమేజ్‌ను, చ‌రీష్మాను ఉప‌యోగించుకుని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీకి గ‌ట్టిపోటీ ఇవ్వాల‌ని నిర్ణయించాయి. జ‌న‌సేన‌తో పొత్తులో భాగంగా త‌మ‌కు ప‌ట్టున్న స్థానాల జాబితాను జ‌న‌సేన‌కు లెఫ్ట్ పార్టీలు అందించ‌నున్నాయి. కృష్ణా, గుంటూరు, క‌ర్నూలు, అనంత‌పురం, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో ఎక్కువ స్థానాల‌ను లెఫ్ట్ పార్టీలు ఆశిస్తున్న‌ట్లు తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad