YCPలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఈమద్య ఆమంచి కృష్ణ మోహన్ తో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు జగన్ ని కలిసిన “కిల్లి కృపారాణి” సైతం త్వరలోనే YCPలో చారనున్నని, జగన్ గారితో అన్నివిషయాలు మాట్లాడనని మీడియాతో తెలిపింది. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా YCP నేత జగన్ ని కలవడం AP రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.
నిజానికి చాలరోజులు అక్కినేని నాగార్జున YCPలో చేరుతాడు అనే ప్రచారం జరిగింది. కానీ అటు జగన్ గాని ఇటు నాగార్జున కానీ ఎలాంటి వివరణ ఎవ్వలేదు. కానీ ఇప్పుడు అట్టహాసంగా నాగార్జున, జగన్ గారిని కలవడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. పైగా నాగార్జున, జగన్ గారిని ఏదో ఊరికే కలవలేదని.. గుంటూరు MP సీట్ కోసమే కలిశారని తెలుస్తుంది. నాగార్జున స్నేహితుడైన ప్రముఖ వ్యక్తికి గుంటూరు MP సీటు కేటాయించాలని నాగార్జున, జగన్ ని కోరినట్లు సమాచారం.