మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గత ఏడాది ఆగస్టు 29వ తేదీన రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల ప్రియ భర్త భార్గవ్రామ్కు కూడా అది రెండో వివాహం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇటీవల అఖిలప్రియను ఇంటర్వ్యూ చేసిన ఓ ప్రముఖ మీడియా ప్రతినిధి పలు ఆసక్తికర విషయాలకు సంబంధించి సమాధానాలను రాబట్టారు.
మీ భర్త భార్గవ్‌రామ్‌తో మీకు వివాహం జరగకముందు ఆయనకు ఆల్రెడీ పెళ్లి అవడంతోపాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని, విడాకులు ఇచ్చి మరీ మొదటి భార్యను, ఆ ఇద్దరు ఆడ పిల్లలను నడిరోడ్డుపై వదిలేసి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారంటూ ప్రశ్నించగా, అందుకు అఖిలప్రియ నవ్వుతూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
తన భర్త భార్గవ్రామ్కు తనకంటే ముందే వివాహం జరిగిన విషయం జగమెరిగిన సత్యమేనని, తనకు కూడా భార్గవ్‌తో రెండో వివాహమేనని చెప్పింది. తన భర్త భార్గవ్ మొదటి వివాహం జరిగిన సంవత్సరానికే ఆమెతో విడాకులు తీసుకున్నాడని, అటువంటిది ఆయనకు ఇద్దరు ఆడ పిల్లలంటే ఎవ్వరూ నమ్మరన్నారు.
భార్గవ్ మొదటి భార్య మీకు కామన్ ఫ్రెంట్ అంట కదా..! అంతేకాకుండా ఆమె పోలీసు అధికారి కుమార్తె కూడాను.. అటువంటిది ఆమెకు అన్యాయం చేసి మరీ భార్గవ్‌తో మీ వివాహం జరగడం అన్యాయం అనిపించలేదా..? అన్న ప్రశ్నకు అఖిలప్రియ స్పందిస్తూ.. ఒకరికి అన్యాయం చేసి పెళ్లిచేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, భూమా నాగిరెడ్డి ఉన్న సమయంలో భార్గవ్ విడాకులు తీసుకున్నాడని, ఆ తరువాత బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని, అలా ఆఫర్ వచ్చిందన్నారు. అయినా రాతరాసి ఉంటే చెరపలేం కదా అంటూ చెప్పుకొచ్చింది అఖిలప్రియ.