భారతదేశంలోనే అపర కుబేరుడు, పారిశ్రామిక వేత్త అయిన “ముకేశ్ అంబానీ” కుమారుడి పెళ్లి పత్రిక చూసిన ప్రతి ఒక్కరూ చూడతరమా..? అంటున్నారు. ఈ పెళ్లి పత్రిక చూస్తే గాలి జనార్దన్ రెడ్డి కూడా మైమరిచి పోయేలా ఉంది. ఇప్పటికే ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహానికి సంబందించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మార్చి 9న వీరిద్దరి పెళ్లి జరగనుంది.
ఇలాంటి సందర్భంలో బయరకు వచ్చిన ఈ పత్రిక ముకేష్ అంబానీ కూతురు “ఈశా అంబానీ” వివాహ పత్రిక మాదిరిగానే విలాసవంతంగా ఉంది. వియ్యంకుల స్థాయికి తగ్గట్టే ఈ ఆహ్వాన పత్రికలను పెద్ద బాక్సులో ఉంచి దానిమీద రాధా కృష్ణుల బొమ్మలను యానిమేషన్ చేయించారు.
ఆ బాక్సులో వెండితో చేసిన రాధాకృష్ణుల ప్రతిమలతో కూడిన వెండి ఫొటోలను ముందు పెట్టారు. దాని తరువాత ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల పెళ్లి ఆహ్వాన పత్రికను ఉంచారు. చూడముచ్చటగా ఉన్న ఈ పత్రిక డిజైన్ చూసిన ప్రతి ఒక్కరూ.. అంబానీ కుటుంబం స్థాయికి తగ్గట్టే ఉంది అంటున్నారు.