Home Latest News చెత్త కుప్పలో సీని నటి కాళ్ళు చేతులు.. వీడిన మిస్టరీ..!

చెత్త కుప్పలో సీని నటి కాళ్ళు చేతులు.. వీడిన మిస్టరీ..!

ఆరోజు జనవరి 21 డంపింగ్ యార్డులో ఓ మహిళా కాళ్లు, చేతులు దొరికాయి. ఇవి ఎవరివో తెలుసుకోవడానికి పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అతికిరాతకంగా శరీర భాగాలను ఇలా వేరుగా చేసి పడవేశారు. చివరకు చెన్నైలోని తూత్తుకూడికి చెందిన సంధ్యగా పోలీసులు గుర్తించారు. ఎట్టకేలకు తమిళనాడులోని చెన్నైలో రెండు వారాల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. అంత కిరాతకంగా చంపినా నిందితుడు ఆమె భర్త గా గుర్తించి నివ్వరపోయారు.

పోలీసుల కథనం ప్రకారం.. 

సినిమాలో సహాయనటి సంధ్య కనిపించలేదని, ఆమె భర్త పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె గత కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్త సినీ దర్శకుడు బాలకృష్ణన్ ను  ఫిబ్రవరి 5న అదుపులోకి తీసుకోని విచారించగా అసలు విషయం బయటపడింది.

చెన్నైలో తూత్తుకూడికి చెందిన బాలకృష్ణన్, సంధ్య వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరు ఇద్దరు పిల్లల్ని కూడా కలిగున్నారు. సినిమాలపై మోజుతో ఇద్దరు చెన్నై లోనే స్థిరపడినారు. బాలకృష్ణన్ కాదల్ ఇలవంశం సినిమాతో డైరెక్టర్ గా మారగా, సంధ్య సహా నటిగా పలు సినిమాలో నటించింది. బాలకృష్ణన్ దర్శకుడు కావడంతో పలువురు ప్రముఖులు పారిశ్రామికవేత్తలు ఆయన నివాసానికి వస్తుండేవారు. ఈ నేపత్యంలో హీరోయిన్ కావాలనుకున్నా సంధ్య ఇంటికి వచ్చే వారితో చనువుగా ఉండేది. అంతేకాదు రాత్రి సమయంలో ఫోన్లో మాట్లాడటం బయటకు తరుచూ వెళ్తుండటం చేసేది. దీంతో సంధ్య వారితో  వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో బాలకృష్ణ పలు మార్లు హెచ్చరించాడు. సంధ్య మాత్రం వినలేదు. ఇక వీరి మధ్య గొడవలు జరగడం మొదలు పెట్టాయి. భర్త అనేక సార్లు చెప్పిన వినిపించుకోలేదని ఆవేశంతో సంధ్యకు విడాకులకు ఇవ్వాలనుకున్నాడు. ఈ క్రమంలో ప్రియుడితోనే ఉంటానని సంధ్య తేల్చి చెప్పింది. జనవరి 19న దంపతులు ఘర్షన పడ్డారు. అప్పటీకే సంధ్యను చంపడానికి పథకం వేసుకున్న బాలకృష్ణన్ కత్తితో ఆమెను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఆ తర్వాత మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పలు చోట్లా పడేశాడు.

ఈ సంఘటన మొత్తం బాలకృష్ణన్ వివరించగా అందరిని షాక్ కు గురిచేసింది. భర్తను కాదని సదురు వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్య పై అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుండా ముక్క ముక్కలుగా చేసి, ఆనవాలు కూడా దొరకకుండా చేశానని అతడు వివరించిన తీరుకు పోలీసులను సైతం నివ్వరపోయేలా చేసింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad