Home Latest News సినీనటి ప్రత్యుష హత్యా వెనక అసలు నిజం ఇదే..! : ఫోరెన్సిక్ నిపుణులు Dr. నారాయణ...

సినీనటి ప్రత్యుష హత్యా వెనక అసలు నిజం ఇదే..! : ఫోరెన్సిక్ నిపుణులు Dr. నారాయణ రెడ్డి

2002 ఫిబ్రవరి 23న చనిపోయిన సినీనటి ప్రత్యుష హత్య కేసు గురించి నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. నిజానికి ఆమె ప్రియుడు సిద్దార్థ్, తనని వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నించాడని.. అయిన ఆమె వినికపోవడంతో అతడు, అతడి స్నేహితులు కలిసి ప్రత్యుషకు విషం ఇచ్చి.. ఆ తరువాత అందరూ కలిసి ఆమెను సామూహిఖ అత్యాచారం చేశారని.. అనంతరం కేసు తమపైకి రాకుండా సిద్దార్థ్ కూడా ప్లాన్ ప్రకారం కొంత విషం తీసుకొని “హై డ్రామా” ఆడారు అనేది ఇప్పటివరకు మనం విన్నా, నమ్మిన నిజం.

కానీ అది 100కు 100 శాతం అబద్దం, ప్రత్యుష చాలా పవిత్రంగానే చనిపోయింది. ఆమెను ఎవ్వరూ ఎలాంటి మానభంగం చేయలేదు. కేవలం కొందరు డాక్టర్లు, పోలీసుల నిర్లక్ష్యమే ఆమెను ప్రాణాలు తీసాయి. లేదంటే ఆమె ఇప్పుడు సిద్దార్థ్ ని పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో ఆనందంగా ఉండేది అంటున్నారు ఉస్మానియా జనరల్ హాస్పటల్ సీనియర్ ప్రొఫెసర్, ప్రిన్సిపల్, ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్ మెంట్ (వైద్య న్యాయ శాస్త్రం) నిపుణులు డాక్టర్ “నారాయణ రెడ్డి”.

ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో సినీనటి ప్రత్యుష హత్య గురించి ఎవ్వరూ ఊహించని, నమ్మలేని నిజాలను బయటపెట్టారాయణ.. నారాయణ రెడ్డి గారు చెప్పింది విన్న చాలామంది ఇది 100 శాతం నిజమే అయివుంటుందని నమ్ముతు.. “సార్ ప్రత్యుష కేసులో నిజంగానే సిద్దార్థ్, ఆయన స్నేహితులు ఆమెను మానభంగం చేసి చంపారేమో అని చాలా బాదపడ్డం.. కానీ అసలు నిజాలు చెప్పి మా మనసులోని బాదని కొంత తగ్గించారు.. మీరు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే డాక్టర్లు, పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఆమె మరణించిందని స్పష్టంగా అర్దం అవుతుంది. అలా ఆమె చావుకు కారణం అయిన ప్రతి ఒక్కరినీ శిక్షించాలి” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సీనియర్ ప్రొఫెసర్, ఫోరెన్సిక్ నిపుణులైన “D. నారాయణ రెడ్డి” గారు ఏం చెప్పారు అన్నది ఒక్కసారి పరిశీలిస్తే.. సిద్దార్థ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోక పోవడం వల్లే ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం నిజమే.. ఇద్దరు విషం తీసుకోవడం నిజమే.. కానీ సిద్దార్థ్, అతడి స్నేహితులు కలిసి ప్రత్యుషను మానభంగం చేశారు అన్నది పచ్చి అబద్దం. నిజానికి వాళ్ళిద్దరూ విషం తీసుకునే సమయానికి ప్రముఖ దర్శకుడు తేజ ఆఫీసు నుండి ప్రత్యుషకు కాల్ వచ్చింది. మీరు “జయం” సినిమాలో హిరోయిన్ గా సెలెక్ట్ అయ్యారని.

ఆ శుభవార్త విన్న ప్రత్యుష వెంటనే తన తల్లికి ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది. అప్పుడు తనతో సిద్దార్థ్ కూడా ఉన్నాడని కూడా చెప్పింది. కానీ అప్పుడే సిద్దార్థ్ తన కుటుంబంలో ఉన్న అసలు పరిస్థితి చెప్పడంతో తమ ప్రేమ విఫలం కంటే ఆ శుభవార్త పెద్ద విషయం కాదు అనుకుందో ఏమో పాపం.. దూరం అయ్యి బాదపడడం కంటే.. చనిపోవడమే ఉత్తమం అనుకోని.. ప్రత్యుష అమ్మగారికి కాల్ చేసి తేజా ఆఫీసుకి వెళ్తున్నామ్ అని చెప్పి.. షాపుకి వెళ్ళి విషం తీసుకొని కూల్ డ్రింక్ లో కలుపుకొని ఇద్దరు తాగేశారు.

అప్పుడే సిద్దార్థ్, ప్రత్యుష ల కామన్ ప్రెండ్స్ అయిన కొందరికి ఫోన్ చేసి మేము త్వరలోనే చనిపోబోతున్నాం… ఫలానా హాస్పటల్ కి వస్తే అసలు నిజం మీకే తెలుస్తుంది అని ఫోన్ చేసి చెప్పారు. ఒకపక్క ప్రత్యుషకు తన స్నేహితుల నుండి వరుసగా ఫోన్ లు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆమె తల్లిగారు “జయం” సినిమాలో ప్రత్యుషకు హీరోయిన్ ఆఫర్ వచ్చిందని చెప్పడమే. దాంతో ఆమెకు కంగ్రాట్స్ చెప్పడానికి అందరూ ఫోన్ లు చేస్తున్నారు. కానీ అప్పటికే ఇద్దరు విషం తీసుకున్నారు.

చివరి నిమిషంలో బ్రతకాలి అనుకున్న ఇద్దరు ఒక ప్రముఖ ప్రయివేట్ హాస్పటల్ వెళ్లారు. కానీ వాళ్ళు చనిపోతే హాస్పటల్ పై కేసు అవుతుందని భావించి వాళ్ళని ముందుగా చేర్చుకోలేదు. ఒక గంట తరువాత పోలీసులకు ఫోన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అంటే.. వాళ్ళు మాత్రం ఇది మా పరిదిలోకి రాదు అంటే.. మా పరిదిలోకి రాదు అని మరికొంత సమయం వృదా చేశారు. చివరికి ఎలాగోలా చాలా ఆలస్యం తరువాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రత్యుష చనిపోయింది.

సినీనటి ప్రత్యుష హత్యా వెనక నమ్మలేని నిజాలు..!
సినీనటి ప్రత్యుష హత్యా వెనక నమ్మలేని నిజాలు..!

అనంతరం ఆమె మృతదేహాన్ని “పోస్టు మాస్టమ్” నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో అక్కడ సీనియర్ డాక్టర్లు లేకపోవడంతో ఒక జూనియర్ డాక్టర్ “పోస్టు మాస్టమ్” చేశాడు. సరైన అవగాహన లేని ఆ డాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రయివేట్ హాస్పటల్లో ట్రీట్మెంట్ కోసం చేసిన గాయాలను గుర్తించకుండా.. ఎవరో ఆమెను గాయపరిచి, బలవంతం చేసి ఆమెను హత్య చేశారు అనే రిపోర్ట్ ఇచ్చాడు. ఇదే ఆమె కేసులో జరిగిన అతిపెద్ద తప్పు. దాంతో ప్రత్యుష తల్లి నా కూతురిని సిద్దార్థ్, అతడి స్నేహితులే హత్య చేసి చంపారని పూర్తిగా నమ్మింది.

ఈమె హత్య వెనక అసలు నిజాలు సీనియర్ ప్రొఫెసర్ “నారాయణ రెడ్డి” దగ్గరకు వచ్చాకే బయటకు వచ్చాయి. కానీ అప్పటికే ఎక్కడ చూసిన ఆమెను మానభంగం చేసి హత్య చేశారు అనే వార్తాలే వినిపిస్తున్నాయి. దాంతో ఎవ్వరూ ఏమి చెప్పిన నమ్మలేదు. అందుకే ప్రత్యుష హత్య కేసు అందరి దృష్టిలో ఇంకా మిస్టరీ గానే మిగిలిపోయింది. చనిపోదాం అని విషం తాగడం ప్రత్యుష, సిద్దార్థ్ ల తప్పు అయితే.. ఆ తరువాత డాక్టర్లు, పోలీసులు సక్రమంగా తమ విధులు నిర్వర్తించక నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రత్యుష చనిపోయిందని నారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad