Home Latest News రాత్రంతా “యూ ట్యూబ్‌” లో సినిమాలు చూస్తుందని భార్యను ఏంచేసాడో చూడండి..!

రాత్రంతా “యూ ట్యూబ్‌” లో సినిమాలు చూస్తుందని భార్యను ఏంచేసాడో చూడండి..!

ఒకప్పుడు సిరియల్స్ కి బానిసైన చాలామంది ఆడవాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాకు బానిసయ్యారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు ఎవరికి ఏం కావాలన్నా సోషల్ మీడియాలోనే వేతుకుతున్నారు. చివరికి మహిళలు ఎక్కువాగా చూసే సిరియల్స్ కూడా “యూ ట్యూబ్‌” లో వస్తుండడంతో టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ టైమ్ పాస్ చేస్తున్నారు. అలా “యూ ట్యూబ్‌”లో రాత్రి పగలు అనే తేడా లేకుండా సినిమాలు చూస్తున్న భార్యను దారుణంగా హత్య చేశాడు ఓ భర్త.

మహారాష్ట్రలోని, ముంబై నగరంలో జరిగిన ఈ దారుణమైన ఘటన దేశం మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. వివరాలల్లోకి వెళ్తే.. చేతన్‌ చౌగేలే (32) అనే వ్యక్తి భార్యతో కలిసి “అంధేరి”లో నివసిస్తున్నాడు. ఈ దంపతులకు 2 ఏళ్ల పాప ఉంది. అయితే గత కొంత కాలంగా భార్య “యూ ట్యూబ్‌”కు బానిసగా మారడంతో చేతన్‌ పలుమార్లు ఆమెను హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు.

ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో దంపతుల మధ్య ఘర్షణ చెలరేగింది. స్పీకర్స్ నుండి సౌండ్‌ ఎక్కువగా వస్తున్న కారణంగా తనకు, బిడ్డకు నిద్ర పట్టడం లేదని చేతన్‌ భార్యకు ఎంత చెప్పినప్పటికీ ఆమె అతడి మాట వినలేదు. నిద్ర వస్తే పాడుకోండి.. లేదంటే మెలకువగా ఉండండి అంతే తప్ప సినిమా చూడడం తప్ప ఆపలేను అను మొహం మీదే చెప్పేసింది.

అలా తెల్లవారు 4 గంటల వరకు తనకు నచ్చిన సినిమాలు చూస్తూనే ఉంది. దాంతో కోపం తట్టుకోలేని చేతన్‌ నైలాన్‌ తాడుతో ఉరి బిగించి, ఆమె గొంతు నులిమాడు. ఆ సమయంలో “భార్య చేనిపోతే ఎలా ?” అనే భయం మొదలైది.. దాంతో వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకువెళ్లాడు కానీ అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు. దాంతో చేసేదిలేక పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆమె ప్రవర్తనకు విసుగుచెందే క్షణికావేశంలో హత్య చేశానని పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad