Home Latest News చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపి 9 ఏళ్ల బాలికపై హత్యాచారం

చాక్లెట్‌ ఇస్తానని ఆశ చూపి 9 ఏళ్ల బాలికపై హత్యాచారం

తల్లిదండ్రుల నిర్లక్ష్యం మృగాల్లాంటి కొందరు సైకోల కమకోరికలకు వరంగా మారుతుంది. అమ్మాయిలు ఎప్పుడెప్పుడు దొరుకుతారా.. తమ వాంఛ ఎప్పుడెప్పుడు తీర్చుకుందామా అని చూసే కామాంధులు గల్లీ గల్లీలో ఉన్నారు. అది తెలిసి కూడ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. తల్లిదండ్రుల నిర్లక్ష్యం అభం శుభం తెలియని ఓ నిండు జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇలాంటి ఘటనలు రోజు టీవీల్లో, పేపర్లలలో ఎన్ని చూసిన వారిలో మాత్రం మార్పు రావడంలేదు.

ఇలాంటి ఘటనే ఇప్పుడు సైదాబాద్‌ లో కలకలం రేపుతుంది. నింటి ముందు ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డడు. సైదాబాద్‌ పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. చంపాపేట డివిజన్‌ “గ్రీన్‌ పార్క్‌” కాలనీ రోడ్‌ నెం.9లో రమావత్‌ శ్రీనునాయక్‌ (24) అనే యువకుడు కుటుంబతో కలిసి నివాసం ఉంటున్నాడు.

బీటెక్‌ చదివిన ఇతను ఈమాద్యే పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. త్వరలో దేహదారుఢ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులు అందరూ బంధువుల పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు “దేవరకొండ”కు వెళ్లారు. దాంతో ఇంట్లో ఉన్న కిరాణా, జనరల్‌ స్టోర్‌ దుకాణం బాధ్యతలు శ్రీనునాయక్‌ చూసుకుంటున్నాడు.

శుక్రవారం రాత్రి స్థానికంగా నివసించే ఓ 9 ఏళ్ల బాలిక, తన సోదరుడితో కలిసి ఇంటి ముందు ఆడుకుంటోంది. అది గమనించిన శ్రీనునాయక్‌ చుట్టుపకాల ఎవ్వరూ లేకపోవడం చూసి ఆ అమ్మాయిని షాప్ లోకి పిలిచాడు.. లోపలికి వస్తే డబ్బులు ఇవ్వకుండానే చాక్లెట్ ఇస్తా అని ఆశ పెట్టాడు. ఆమెకు తోడుగా ఉన్న సోదరుడిని ఇంటికి వెళ్లమని బెదిరించడంతో ఆ బాలుడు వెళ్లిపోయాడు. పిల్లాడు ఒక్కడే ఇంటికి రావడంతో అక్క ఏది అని తల్లి అడగగ అసలు విషయం చెప్పాడు.

అనుమానం వచ్చిన ఆ తల్లి కిరాణా షాప్ కు వెళ్ళేలోపే శ్రీనునాయక్‌ ఆ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు పరిస్థితి చూసిన ఆమె కన్నీళ్లతో సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఆ చిన్నారికి రక్తస్రావం ఎక్కువగా అవుతుండటంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దాంతో అర్ధరాత్రి సమయంలో గాంధీ హాస్పటల్ కి తీసుకెళ్లారు.

గాంధీ వైద్యులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరడంతో, సరూర్‌ నగర్‌ ఠాణాకు వెళ్ళి కంప్లెంట్ ఇచ్చారు. కానీ ఈకేసు సైదాబాద్‌ పరిధిలోకి వస్తుంది అని చెప్పడంతో శనివారం తెల్లవారుజామున ఠాణాలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నీలగడగానే ఉంది అంటున్నారు వైద్యులు.. ఇదిలాఉంటే నింధితుడు శ్రీనునాయక్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి తండ్రి ఓ జాతీయ పార్టీ నాయకుడు కావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం SI “రామునాయక్‌” కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad