60 ఏళ్లు నిండిన ప్రతి రైతుకు రూ.5వేల పింఛన్ ఇస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మట్టిలో నుంచి మనం తినే ఆహారాన్ని పండించే రైతుకు చివరకు గుక్కెడు గింజలు లేక ఆకలితో మరణిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి తీర్చే రైతన్నకు ఎంత చేసినా తక్కువేనన్నారు.
మట్టిలో నుంచి మనం తినగలిగే ఆహారాన్ని బయటకు తీసే శక్తి ఉన్న వాడు రైతన్నారు. అటువంటి రైతు నేడు కన్నీళ్ల మధ్య గడుపుతుండటం బాధాకరమన్నారు. వారిని ఆదుకునేందుకు జనసేన రూ.5 వేల పింఛన్‌ను నగదును ప్రతి నెలా అందించేలా మేనిఫెస్టోలో పొందుపరిచిందని పవన్ కళ్యాణ్ అన్నారు.