సాధారణంగా మనం ఎక్కువగా కష్టపడ్డా.. ఉష్ట్రోగ్రత ఎక్కువగా ఉన్న చోట చాలా సమయం గడిపితే చెమట అనేది వస్తుంది. మరికొంత మందికి శరీర తత్వాలను బట్టి కూడా చమట వస్తుంది. యుక్త వయసు నుంచి చెమట పట్టడం ఎక్కువగా చూస్తుంటాం. ఎండాకాలంలో విపరీతమైన ఉక్కపోత ఉంటుంది.. ఈ క్రమంలో చెమటలు పట్టడం సహజం. కొంతమంది టీనేజర్లకు బాగా చెమటలు పట్టి బట్టలు తడిసిపోతుంటాయి. అయితే చెమట ఎక్కువగా పడితే మనిషి డీహైడ్రేషన్‌కి గురయ్యే అవకాశం ఉంది. మనిషికి చెమటలు ఎక్కవ పట్టినా ప్రమాదమే.. అలా అని అసలు చెమటలు పట్టకపోవడం కూడా ప్రమాదమే. చమట అనేది మన ఫ్యాట్ ని తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది. అందుకే చాలా మంది చెమటలు పట్టే వరకు వ్యాయామం చేస్తుంటారు. ఇక చెమట ఎక్కువగా పట్టని వారి శరీరం కాస్త మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంది. అయితే కొంత మందికి కాస్త చెమట పట్టినా విపరీతమైన స్మెల్ వస్తుంది.. మరికొంత మందికి అసలు స్మెల్ ఏమాత్రం రాదు. చెమట పట్టడం అనేది చాలా మంచిది, చెమట ఎంత ఎక్కువగా పడితే బాడీ అంతా రిలాక్స్ అవుతుంది, కాబట్టి డైలీ కాస్త చెమట పట్టడం అనేది మన శరీరానికి అవసరం. ఇందు కోసం వ్యాయామం చేయడం మంచిది. కొంతమందికి కొద్దిగా చెమట పట్టినా స్మెల్ వస్తుంది. మరికొంత మదికి ఎంత చెమటలు పట్టిన కూడా వారికి స్మెల్ రాదు. ఇక చెమట ఎక్కువగా పట్టేవారు మజ్జిగను పల్చగా చేసి తాగితే చాలా మంచది.. అలాగే రెండు పూటల స్నానం చేయాలి. శరీరంలో అధిక వేడి తగ్గించుకునేందుకు చలువ చేసే జ్యూస్ తాగితే మంచింది. ఈ విషయం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.