వ్యాయామం చేయకుండానే ఈ చిట్కాలతో బరువు తగ్గేయచ్చు!

Without workouts weight Loss

అధిక బరువు, ఊబకాయం, ఒబేసిటీ.. పేరు ఏదైనా ఇప్పుడు ఈ సమస్యతో ఎంతో మంది బాధపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల తీరు మారిపోవడమే ఇలా వెయిట్‌ పెరిగిపోవడానికి కారణం. అంతే కాకుండా ఆహారపు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌ తినడం వల్ల చిన్నప్పటి నుంచే ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఇది ఒక్కసారిగా పోయే సమస్య కాదు. ముఖ్యంగా వ్యాయామం చేయడం వల్ల మార్పు వస్తుందని అందరూ చెప్తుంటారు. కానీ, అది అందరికీ కుదరకపోవచ్చు. కానీ, కొన్ని చిట్కాలు, టెక్నిక్స్‌ తో వ్యాయామం చేయకుండానే బరువు తగ్గేయచ్చు. అదెలాగో చూడండి.

నీరు తాగడం..

Without workouts weight Loss

మీరు రోజూ చేసే పని ఇది. కానీ, సరైన పద్ధతిలో చేయాలి. బరువు తగ్గడంలో మంచినీరు ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. రోజుకు 2 నుంచి 4 లీటర్ల నీరు తాగడం మంచిది. అయితే మీరు భోజనం చేయడానికి ఒక అరగంట ముందు మంచినీళ్లు తాగడం మంచిది. ఎందుకంటే అలా చేయడం వల్ల మీకు ఎక్కువ ఆకలి కాదు. అప్పటికే కడుపు నిండిపోయిన ఫీలింగ్‌ ఉండటం వల్ల తక్కువగా తింటారు.

చిన్న ప్లేట్‌ వాడండి

మనం ఎంత వద్దు అనుకున్నా మనసుని, ఆకలిని కంట్రోల్‌ చేయలేం. కాకపోతే తినే పోర్షన్లను తగ్గించుకోవచ్చు. అవును.. మీరు ముందుగా చిన్న ప్లేట్‌ వాడండి. చిన్న ప్లేట్‌ వాడటం వల్ల కొంచమే పెట్టుకున్నా ఎక్కువ అన్న ఫీలింగ్‌ వస్తుంది. పెద్ద ప్లేట్‌ వాడటం వల్ల ఎంత తింటున్నాం అన్నది తెలియదు.

ఆహారాన్ని నమిలి తినండి

ఇది అందరికీ తెలిసిన విషయమే. మన పెద్దవాళ్లు ఎప్పటి నుంచో చెబుతున్న విషయమే. తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి. సగం సగం తినడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. మీ మెదడుకి కూడా గుర్తుండేలా నిదానంగా నమిలి తింటే శరీరం వెంటనే మిమ్మల్ని ఏదైనా తిను అని అలర్ట్‌ చేయదు. దీన్ని వెయిట్‌ లాస్‌ గోల్డెన్‌ రూల్‌ అని కూడా అంటారు. అలా అని నిదానంగా లాగించేస్తూ ఉండకూడదు. ఎంత తినాలో అంతే.. నిదానంగా నమిలి తినాలి.

జంక్‌ ఫుడ్‌ వద్దు

Without workouts weight Loss

ఇది తప్పకుండా పాటించాల్సిన రూల్‌. జంక్‌ ఫుడ్‌ మన శరీరంపై చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. జంక్‌ ఫుడ్‌ లో ఫ్యాట్‌, కేలరీలు ఎక్కువ ఉంటాయి. అవి డైజెస్ట్‌ అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. జంక్‌ ఫుడ్‌ వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువ తయారవుతుంది.

ఆరోగ్యకర చిరు తిండి

స్నాక్స్‌ ఎప్పుడూ హెల్తీగా ఉండాలి. ముఖ్యంగా ఫ్రూట్స్‌ తీసుకోవడం ఉత్తమం, ఆకుకూరలు, కూరగాయలను కూడా ఉపయోగించడం మంచిది. నట్స్‌ ను కూడా స్నాక్స్‌ గా తీసుకోవచ్చు. ఏదైనా మోతాదుకు మించి తినకూడదు.

Without workouts weight Loss

 

మంచినిద్ర, ప్రశాంతంగా ఉండటం కూడా ఎంతో ముఖ్యం. మనిషి ఎంత ఒత్తిడిని తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా ఉంటాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. వ్యాయాన్ని పూర్తిగా అవాయిడ్‌ చేయండి అని చెప్పడం కాదు. చేసేందుకు అవకాశం లేని వారు ఇలాంటి చిట్కాలను పాటిస్తే ఉపయోగం కనిపిస్తుంది. బరువు తగ్గకపోయినా.. పెరిగే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ చిట్కాలు అధ్యనాల ప్రకారం ఇచ్చినవి. ఇది మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్య ఏదైనా ఉంటే ముందుగా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.