మాములుగా కొంతమంది మెడ చుట్టూ నల్లగా పేరుకుపోయి ఉంటుంది. ఇది చూడటాని అంద వికారంగా కూడా ఉంటుంది. దీనిని పోగొట్టేందుకని చాలా మంది కృత్రిమంగా లభించే పదర్థాలను వాడుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా మెడపై పేరుకుపోయిన ఆ మచ్చలు పోనేపోవు. ఇలా మెడ చుట్టూ పేరుకుపోయిన నల్లటి మచ్చలను పోగొట్టేందుకని మార్కెట్లో దొరికే ఎన్నో రకాల క్రీములను వాడుతూ ఉంటారు. మెడపై నలుపు పేరుకుపోవడానికి కారణం! సహజంగా అందరూ మెడలో గొలుసులు వేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అలా ధరించడం కారణంగా ఎలర్జీని కలిగించడమే కాకుండా మెడపై ఇలా నల్లటి మచ్చలు పేరుకుపోతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. మరో విధంగా కొందరు లావుగా ఉండడం, శుభ్రత పాటించకపోవడం, ఆర్టిఫిషియల్ జువెలరీలు వాడటం కారణంగా కూడా ఇలా మెడపై నల్లగా పేరుకుపోతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక ఇవే కాకుండా తలకు పెట్టుకునే హెయిర్ కలర్ కారణంగా, ఇంకొంతమంది ప్రెగ్నెన్సీలో వచ్చే ఆరోగ్య సమస్యల కారణంగా కూడా మెడపై ఇలాంటి మచ్చలు ఏర్పడుతుంటాయి. నివారణ చర్యలు ఇలా పేరుకుపోయిన మచ్చలు పోవాలంటే ఈ చిట్కాను పాటించండి. ఆ చిట్కా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫిల్టర్ చేసిన కాఫీ పొడిలో కొద్దిగా చెక్కర, మరి కొద్దిగా తేనే ఈ రెండిటిని కలిపి నిమ్మకాయ డొప్పితో క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్రతీ రోజూ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆయిల్ స్కిన్ ఉన్నవారికి చాలా బాగా ఫలితాన్ని చూపిస్తుందని చర్మ నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ చిట్కాని పాటించి మెడపై పేరుకుపోయిన ఈ నలుపు మచ్చలను తొలగించుకోండి.