వీటిని ఎక్కువసేపు ఫ్రిజ్ లో ఉంచితే ప్రమాదమే..!

ఈ మధ్యకాలంలో మనుషుల జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యం ఆహారం విషయంలో సమయపాలన లేక అనారోగ్యం పాలవుతున్నారు. సాధారణంగా తినేవి ఫ్రిజ్(Refrigerator)లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా తినేయొచ్చు అనుకుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం. ఫ్రిజ్ ఉంది కదా.. అని అన్నిటిని స్టోర్ చేయడం మంచిది కాదు. ఫ్రిజ్ అనేది అందులో పెట్టే కూరగాయలు, పండ్లను తాజాగా ఉంచుతుంది. అలాగని ఫ్రిజ్ అన్నింటినీ తాజాగా ఉంచదని గుర్తుంచుకోవాలి. మరి ఫ్రిజ్ లో ఎక్కువకాలం నిల్వ ఉంచకూడనివి ఏంటో చూద్దాం!

Keera min

బంగాళాదుంప(Potato):
బంగాళాదుంపలను ఫ్రిజ్ లో నిల్వ చేయడం వల్ల బంగాళాదుంప పిండి చక్కెరగా మారుతుందని గుర్తుంచుకోండి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రాణాపాయం కావచ్చు. బంగాళదుంపలను ఫ్రిజ్‌లో పెట్టే బదులు పేపర్ బ్యాగ్‌లో పెట్టి తెరిచి ఉంచితే సరిపోతుంది.

టమాటా(Tomato): కొంతమంది టమాటాలను ఎక్కువసేపు ఫ్రిజ్‌లో ఉంచుతుంటారు. అయితే ఫ్రిజ్‌లోని చల్లటి గాలి కారణంగా టమోటాలు త్వరగా కుళ్లిపోతాయనే విషయం తెలుసా.. తాజాగా కనిపించే టమాటాలు చలికి చెడిపోతాయి. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు.

అరటిపండు(Banana): కొంతమంది తెలియక అరటి పండ్లను కూడా ఇతర పండ్లతో పాటు ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. ఆహారాన్ని తాజాగా ఉంచే ఫ్రిజ్ అరటి పండును త్వరగా పాడు చేస్తుంది. అరటిపండును ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారిపోతుంది. అందుకే అరటి పండును ఫ్రిజ్‌లో మానుకుంటే మంచిది.

తేనె(Honey): తేనెలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని, ఆరోగ్యాన్ని కాపాడుతుందని తెలిసిందే. కొంతమంది తేనెను బయట ఉంచడం వలన చెడిపోతుందనే భయంతో ఫ్రిజ్‌లో పెడతారు. ఫ్రిజ్‌లో తేనె తాజాగా ఉంటుందని అనుకుంటారు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల తేనెలో ముడి ఏర్పడటం మొదలవుతుంది. అలాగే తేనె రుచి కూడా పాడైపోతుంది.

దోసకాయలు(Cucumber):
సామాన్యంగా ఫ్రిజ్ లో నిల్వచేసే వాటిలో దోసకాయ కూడా ఉంటుంది. మీరు నమ్మకపోవచ్చు, కానీ చల్లని ప్రదేశాలు దోసకాయలను పాడు చేస్తాయి. దోసకాయలు చలికి క్షీణించిపోయి దాని భాగాలు నీరుగా మారవచ్చు.

తాజా మూలికలు:
నిజానికి తులసి, పార్స్లీ, కొత్తిమీర లాంటి తాజా మూలికలు ఫ్రిజ్‌లో ఉండలేవు. శీతల వాతావరణంలో ఎక్కువసేపు ఉండటం వల్ల అవి అకాలంగా వాడిపోతాయి. ఈ వస్తువులను ఫ్రిజ్ నుండి దూరంగా ఉంచడం వలన వాటి నాణ్యత పెరుగుతుంది. మరి ఈ అంశం పై మీకు తెలిసిన విషయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.