ఏడవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా?

మనిషికి దెబ్బతగిలినా లేక వారి మనసుకి గాయం కలిగిన మొదటగా ప్రతి ఒక్కరు చేసే పని ఏడవడం. కానీ మగపిల్లలు ఏడిస్తేనే ఆడదానిలా ఆ ఏడుపు ఏంటి రా అని తిడతారు. అదే ఆడపిల్ల ఏడ్చిందా.. అమ్మాయి ఏడవడం అనేది ఇంటికి దరిద్రం అంటూ మన బంధువులు, తల్లిదండ్రులు మనకు చెబుతూ ఉంటారు. కానీ అదే ఏడుపు వల్ల మనిషికి అనేక ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో తనివితీరా ఏడవండి అంటూ కూడా సలహాలు ఇస్తున్నారు. అసలు మనిషి ఏడవడం వల్ల ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Cry min

ఏడుపు వల్ల కలిగే లాభాలు

  • మనిషి ఏడుపు వల్ల సృజనశక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. సున్నితమైన మనసు గల వారు చిన్న చిన్న ఘటనలకు కూడా ఏడుస్తూ ఉంటారు. అలా ఏడవడం వల్ల అలాంటి వ్యక్తుల్లో ఆలోచన శక్తితో పెరగడంతో పాటు సృజనశక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
  • మన శరీరంలో తల్లిపాలు, లాలాజలం, వీర్యంతో పాటు మనం కార్చే కన్నీరులో కూడా ‘లైసోజైం’ అనే ప్రొటిన్ ఉంటుందట. ఈ ప్రొటిన్ మన శరీరంలో ఉండే బాక్టీరియాను చంపుతుందని వైద్యులు చెబుతున్నారు.
  • మనం కష్టాలలో ఉన్నా, బాధలో ఉన్న మన కంటినుండి కన్నీరు కారుతూ ఉంటుంది. అలాంటి సమయంలో తనివితీర ఏడవాలని దీని వల్ల ముందుకు సాగే ధైర్యం మరింత వస్తుందని డాక్టర్లు తెలియజేస్తున్నారు.
  • మరో కీలకమైన విషయం ఏంటంటే..? మన ఏడుపు వల్ల కుటుంబ బంధాలతో పాటు తెగిపోయిన బంధాలు కూడా కలిసే అవకాశం ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.

చూశారుగా మనం ఏడుపు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇక నుంచి అలాంటి సందర్బాల్లో తనివితీర ఏడవండి అంటూ ప్రముఖ ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.