
ఏ విషయంలోనైనా ‘అతి’ అనర్ధాలకు దారి తీస్తుందనేది వాస్తవం. అయితే కొందరు మాత్రం తమ ఉత్సాహం కోసం ఎంత అతిగా చేస్తారంటే ఒక్కోసారి అది వారికి హాని కలిగించి ఏకంగా ప్రాణాలకు ఎసరు పెడుతోంది. తాజాగా జరిగిన ఓ ఘటన దీనికి పూర్తి ఉదాహరణగా నిలిచింది. కేరళలో ఓ యువతి అత్యుత్సాహం ఆమెకు మృత్యువును మిగిల్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
కేరళలోని అలప్పుఝకు చెందిన 19 ఏళ్ల యువతి, తనకు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో గాఢమైన బంధం ఏర్పర్చుకుంది. రోజూ అతడితో అన్ని విషయాలను పంచుకుంటూ ఉన్న ఆ యువతి, ఆగస్టు 12న అతడిని కలవాలని వెళ్లింది. కొచ్చిన్లో తనకు ఇంటర్వ్యూ ఉందని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆ యువతి, తనకు సోషల్ మీడియాలో పరిచయమైన గోకుల్ను కలుసుకుంది. అతడితో కలిసి ఆమె ఓ హోటల్లో గది తీసుకుని, శృంగారంలో రెచ్చిపోయింది. అయితే ఆమె శృంగారాన్ని అతిగా చేయాలంటూ కక్కుర్తి పడింది. అయితే ఈ క్రమంలో ఆమె మర్మాంగాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావం జరిగింది.
దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఆ యువకుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని గోకుల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇలా శృంగారం కోసం కక్కుర్తి పడ్డ ఆ యవతి చివరకు మృతిచెందడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.