Home General పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి ఈ విషయం తెలుసా ? : అదృష్టం, ఆనందం

పోస్ట్ ఆఫీస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి ఈ విషయం తెలుసా ? : అదృష్టం, ఆనందం

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు ఉపయోగించుకోవచ్చు అని మీకు తెలుసా..? ఇంతకీ మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉందా ? లేదు అంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఎందుకంటే సాదారణ బ్యాంక్ అకౌంట్ కంటే.. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ వల్లే ఎక్కువ లాభాలు ఉన్నాయి. మీరు ఒక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి మరో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్‌ ఫర్ చేయొచ్చు.

ఇదేకాక ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా వాడుకోవచ్చు.. అందుకోసం ebanking.indiapost.gov.in వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల్ని ఉపయోగించుకోవడానికి ముందు మీ సింగిల్ లేదా జాయింట్ సేవింగ్స్ అకౌంట్ యాక్టీవ్‌గా ఉండాలి. KYC డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండాలి. ఏటీఎం, డెబిట్ కార్డ్ కూడా పనిచేస్తుండాలి. వీటితోపాటు మొబైల్ నెంబర్, పాన్, ఇమెయిల్ ఐడీ అప్‌ డేట్ చేసి ఉండాలి.

ఇండియా పోస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ద్వారా మీరు సేవింగ్స్ అకౌంట్‌తో పాటు రికరింగ్ డిపాజిట్ అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ కూడా ఆపరేట్ చేయొచ్చు. అందుకోసం ముందుగా మీరు మీ “హోమ్ బ్రాంచ్‌”కు వెళ్లి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అప్లికేషన్‌ తో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ విజయవంతంగా పూర్తైన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌ కు SMS అలర్ట్ వస్తుంది.

ఆ SMSలోని యూఆర్ఎల్ క్లిక్ చేసి ఇండియా పోస్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ చేయాలి. అందులో “New User Activation”ను క్లిక్ చేయాలి. ఇలా మీ వివరాలన్నీ పూర్తి చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్, పాస్‌ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తరువాత మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad