Home General ప్రియుడితో కలిసి మరో ప్రియుడ్ని చంపేసింది..!

ప్రియుడితో కలిసి మరో ప్రియుడ్ని చంపేసింది..!

రోజు రోజుకు అక్రమ సంబంధాలు పెట్టుకొంటూ, పతి ప్రాణాలను తీసేస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాళి కట్టిన భర్తను చంపి , కన్నపేగు తెంచుకుని పుట్టిన పిల్లల్ని అనాథలు గా చేస్తున్నారు మహా ఇల్లాలులు. కొందరు భర్త కళ్లలో ఫెవి కిక్ పోస్తే, మరి కొందరు ప్రేమికుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి భర్తను పైకి పంపిస్తే, ఇంకొందరు భర్తను నిద్ర మాత్రలతో చంపిసినవారు. ఇలా అక్రమ సంబంధాలను కొనసాగించాలని మహిళలు విచక్షణను కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా భర్తను వదిలేసింది. ప్రియుడితో సహజీవనం మొదలెట్టింది. ఇంతలో ఇంకో ప్రియుడు తగలగానే మొదటి ప్రియుడిని చంపేసింది. ఈ సంఘటన అందరిలో కలకలం రేపుతోంది.

పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలములో ఈ ఉదంతం చోటు చేసుకుంది. శివరామకృష్ణకు మూడు సంవత్సరాల క్రితం నన్నేబీతో పరిచయం కాగా, మెల్లిగా వీరి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. క్రమేపా శివ కట్టుకున్న భార్యకు సైతం విడాకులు ఇచ్చి నన్నేబీతో సహజీవనం మొదాలుపెట్టాడు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌కు వచ్చి వీరి సహజీవనము కొనసాగిస్తున్నారు. నన్నేబీకి కూలి పని చేసే చోట మరో వ్యక్తి జయరాంరెడ్డితో కూడా అక్రమ సంబంధం పెట్టుకొని, విలాసాలకు అలవాటు పడింది.

ఆతరవాత కొన్ని రోజులు గడిచాక బాపట్లకు తిరిగి వచ్చారు కానీ, నన్నేబీ మాత్రం విలాసాలకు అలవాటు పడి శివతో గొడవపడుతూ ఉండేది. క్రమక్రమంగా వీరి మధ్య రోజురోజు గొడవలు జరుగుతున్నా, జయరాంరెడ్డితో తన సంబంధాన్ని కొనసాగిస్తోంది. ఇక వారి సంబంధానికి అడ్డుగానున్న శివరామకృష్ణను చంపేయాలనుకుంది. జయరాంరెడ్డి, నన్నేబీ ఇద్దరు కలిసి శివను అంతమొందించడానికి పథకం వేశారు. అంతే జయరామిరెడ్డి బాపట్లకు వచ్చాడు. శివను పార్టీ చేసుకుందామని చెప్పి చీరాల వరకు తీసుకొచ్చారు. ముగ్గురు కలిసి పార్టీ చేసుకొనే సమయాన, శివకు మద్యంలో పురుగుల మందు కలిపారు. అది తాగిన శివ స్పృహ కోల్పోవడంతో వెంటనే సమీపాన గల మురుగు కాలువలో పడవేసి పారిపోయారు.

అక్కడి స్థానికులు పడిఉన్న శివరామకృష్ణను చూసి 108కు సంచారాన్ని అందచేశారు. చీరాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా, శివ చికిత్స పొందుతూనే మృతి చెందాడు. పోలీసులకు శివ దగ్గర దొరికిన ఆధారాల ప్రకారం బాపట్ల వాసిగా గుర్తించి, దర్యాప్తు చేయగా నన్నేబీతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంకా లోతుగా విచారించగా అసలు ఉదంతమంతా బయటపడింది. నిందితులైన నన్నేబీ, జయరాంని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad