
కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం లాక్డౌన్లోకి వెళ్లింది. ఈ క్రమంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. అయితే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు ఇంట్లోనే తమ పనులు చేసుకుంటున్నారు. కాగా ఈ లాక్డౌన్ కారణంగా ఎవరైనా ఇబ్బంది పడ్డవారు ఉన్నారా అంటే అది ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఆడవారు అని చెప్పాలి. భార్యలు తమ భర్తలకు, పిల్లలకు రకరకాల వంటకాలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు.
కానీ ఘనా అనే దేశంలో ఓ భార్య లాక్డౌన్ను వెంటనే ఎత్తేయాలంటూ ఏకంగా ఆ దేశ అధ్యక్షుడికి ఓ ఉత్తరం రాసింది. అంతగా ఆమె ఇబ్బంది పడటానికి కారణమేమిటా అని పలువురు ఆరా తీయగా అసలు విషయం తెలుసుకుని ఆశ్చార్యానికి గురయ్యారు. ఆమె భర్త లాక్డౌన్ విధించినప్పటి నుండి ఇంట్లోనే ఉంటూ రోజూ ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటున్నాడట. దీంతో ఆమె ఆ బాధను భరించలేకపోతున్నాని, తన భర్త కోరికను తాను తీర్చలేకపోతున్నానంటూ ఆ దేశ అధ్యక్షుడికి లేఖ రాసింది.
వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్నా, ఇది ఆడవారు పడుతున్న భాధకు అద్దం పట్టే ఘటన. లాక్డౌన్ కారణంగా ఇంట్లో ఉంటున్న మహిళలు చాలా మంది ఇలాంటి చెప్పుకోలేని బాధలను ఎదుర్కొంటున్నారని పలు సర్వేలు కూడా చెబుతున్నాయి. అయితే ఇంట్లో మహిళలను చులకనగా చూసే వారి ఇళ్లలోనే ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, తమ భార్యను గౌరవిస్తున్న భర్తలతో మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆ సర్వేలు చెబుతున్నాయి. ఏదేమైనా ఆడవారి ఇష్టాలను తెలుసుకుని మసలడం చాలా మంచిదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.