తన మిగిలిన జీవితాన్ని ప్రియుడితో కలిసి కొనసాగించాలని భావించిన ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో చోటు చేసుకుంది. భర్తను కడతేర్చిన భార్య కట్టుకథ అల్లి స్థానికులను నమ్మించినా.. పోలీసుల విచారణలో నిజం చెప్పక తప్పలేదు. ప్రియుడి కౌగిళ్లలో బంధీ కావాలని భావించిన ఆ ఇల్లాలు.. ప్రస్తుతం జైలు గదిలో బంధీగా పడివుంది.
ఈ కామ ఇల్లాలు గురించి, భర్త హత్యా ఉదంతం గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఎలక్ట్రీషియన్ అబ్దుల్లా (27), జూలూరుకు చెందిన షేక్ హమీద్‌కు 2012లో వివాహమైంది. వారి కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో అక్బర్ అనే వ్యక్తికి, హమీదా మధ్య పరియం పెరిగింది. వీరి పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది.
భార్య హమీద అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త అక్బర్ హమీదాను ఎన్నిసార్లు హెచ్చరించినా లాభం లేకపోయింది. ఏకంగా అబ్దుల్లా ముందే భార్య హమీదా ఇంట్లోనే రాసలీలల బాగోతం నడిపేది. భార్యను మార్చలేక మానసిక క్షోభకు గురైన భర్త అబ్దుల్లా విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.
భర్త విడాకుల విషయం తెలుసుకున్న భార్య హమీదా తన అక్రమసంబంధం విషయం సమాజానికి తెలిసిపోతుందని, బంధువుల నుంచి చీవాట్లు ఎదురవుతాయని భావించి భర్త హత్యకు ప్లాన్ చేసింది. తాను అనుకున్నట్లే ప్రియుడి చేత నిద్రపోతున్న భర్తను హత్య చేయించింది.
భర్త ముఖంపై ప్రియుడు దిండుపెట్టి ఊపిరాడనివ్వకుండా ఉంచితే.. భార్య కాళ్లు, చేతులను కదలకుండా పట్టుకుంది. దీంతో ఊపిరాడని ఆ భర్త ఇల్లాలి కుట్రకు బలయ్యాడు. తన భర్తకు మూర్చ రావడంతో నిద్రలోనే మరణించాడని సమాజాన్ని నమ్మించేందుకు యత్నించింది. కానీ, అనుమానం వచ్చిన భర్త తరుపు బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. హమీదాను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో నిజాన్ని బయటకు రాబట్టారు. అబ్దుల్లాను తాను హత్య చేయించినట్లు నిజం ఒప్పుకున్న హమీదా ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోంది.