Home General జ‌య‌రామ్ హ‌త్య : ఆస్తిపాస్తుల‌న్నీ ఎవ‌రి పేరుమీద ఉన్నాయంటే..!

జ‌య‌రామ్ హ‌త్య : ఆస్తిపాస్తుల‌న్నీ ఎవ‌రి పేరుమీద ఉన్నాయంటే..!

ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌ జ‌య‌రామ్ హ‌త్య కేసును కృష్ణా జిల్లా పోలీసులు చాలా సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఎస్పీ త్రిపాఠి ఆధ్వ‌ర్యంలో కేసు విచార‌ణ జ‌రుగుతోంది. జ‌య‌రామ్‌కు ద‌గ్గ‌రి ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తి ద్వారా ఫోన్ చేయించి రాకేశ్‌రెడ్డి ప‌థ‌కం ప్ర‌కారం అత‌న్ని హ‌త్య చేయించిన‌ట్టు ఇప్ప‌టికే పోలీసుల విచార‌ణ‌లో నిర్ధార‌ణ అయింది.

జ‌య‌రామ్‌కు పాయిజ‌న్ ఇంజ‌క్ష‌న్ ఇవ్వ‌డంతోనే ప్రాణాల‌ను కోల్పోయిన‌ట్లు శ‌వ ప‌రీక్ష‌లో వెల్ల‌డైంద‌ని, ఈ హ‌త్య కేసులో కిరాయి హంత‌కుల‌కు కూడా ప్రమేయం ఉన్న‌ట్టు పోలీసులు చెబుతున్నారు.

అంతేకాక‌, జ‌య‌రామ్ మృత దేహాన్ని హైద‌రాబాద్ నుంచి కారులో కృష్ణా జిల్లాకు త‌ర‌లించిన‌ట్లు, ఆ కారును మ‌రో కారు తెలంగాణ స‌రిహ‌ద్దుల వ‌ర‌కు ఫాలో అయిన‌ట్టు కూడా ఆధారాలు ల‌భించాయి. నాలుగు రోజుల నుంచి వివిధ కోణాల్లో పోలీసులు జ‌యరామ్ మ‌ర్డ‌ర్ కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు.

జ‌య‌రామ్ హ‌త్య హైద‌రాబాద్‌లో జ‌రిగింది కాబ‌ట్టి ఈ కేసును హైద‌రాబాద్‌కు బ‌ద‌లాయించే అవ‌కాశాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో అనేక చిక్కు ముడులు ఉన్నాయ‌ని పోలీసులు అంటున్నారు.అయితే, ఆరునెలల క్రిత‌మే జ‌య‌రామ్ త‌న పేరుమీద ఉన్న ఆసుత‌ల‌న్నింటినీ శిఖా చౌద‌రి పేరుపై రిజిస్ట్రేష‌న్ చేయించిన‌ట్టు తెలుస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad