Home General ఇక‌పై వాట్స‌ప్ వాడాలంటే నెల‌కు రూ.499లు క‌ట్టాలి..!

ఇక‌పై వాట్స‌ప్ వాడాలంటే నెల‌కు రూ.499లు క‌ట్టాలి..!

ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ నేటి ఆధునిక సాంకేతిక యుగంలో ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగ‌మైన సంగ‌తి తెలిసిందే. బ్యాంక్‌లో అకౌంట్ లేని వారు కూడా స్మార్ట్ ఫోన్ కొనుగోలుచేసి ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ అకౌంట్స్‌ను ఓపెన్ చేసేస్తున్నారు. అంత‌లా ప్ర‌తి ఒక్క‌రి జీవితంలో భాగ‌మైన ఈ ఫేస్‌బుక్‌, వాట్స‌ప్ బుధ‌వారం సాయంత్రం నుంచి గురువారం ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు స‌రిగ్గా ప‌నిచేయ‌లేదు.

ఈ స‌మ‌యంలో వాట్స‌ప్‌, ఫేస్‌బుక్‌ల‌లోని ఫోటోలు, వీడియోలు డౌన్‌లోడ్ కాకపోవ‌డంతో యూజ‌ర్లు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. ఇక వారం రోజుల‌పాటు ప‌నిచేయ‌ద‌ని, సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైరల్ అవుతున్నాయి. సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజ‌ముంది..? వాట్స‌ప్ నిజంగానే వారం రోజుల‌పాటు ప‌నిచేయ‌దా..? అన్న అంశానికి సంబంధించి పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల ప్ర‌కారం కొన్ని సాంకేతిక కార‌ణాల‌వ‌ల్ల నెట్‌వ‌ర్క్ ప‌నిచేయ‌క‌పోవ‌డంతో వాట్స‌ప్‌, ఫేస్‌బుక్ ప‌నిచేయ‌దు. మ‌రో వారం రోజుల‌పాటు వాట్స‌ప్ ప‌నిచేయ‌ద‌ని గూగుల్‌పేరిట ఒక వార్త వైర‌ల్ అవుతోంది. అయితే, ఈ యాప్‌తో అస‌లు సంబంధ‌మేలేని గూగుల్ స‌ర్వీస్ ఎందుకు పంపుతుంది..? పైగా స‌ర్వీసుల‌న్నిటిని పున‌రుద్ద‌రించామ‌ని ఎఫ్‌బీ తెలిపింది. మ‌రి వాట్సప్ వారం రోజులపాటు ఎందుకు ప‌నిచేయ‌దు. ఇదే స‌మ‌యంలో ఉద‌యం 11 : 30 గంట‌ల నుంచి ఉద‌యం ఆరు గంట‌ల వ‌ర‌కు వాట్స‌ప్ ప‌నిచేయ‌ద‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎటువంటి వాస్త‌వాలు లేవ‌ని, ఎఫ్‌బీ ఈ సంద‌ర్భంగా ప్ర‌క‌టించింది. మొత్తంగా వాట్స‌ప్ వాడాలంటే నెల‌కు రూ.499లు క‌ట్టాలంటూ
సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వార్త ఫేక్ అని స్ప‌ష్ట‌మైంది.

అంతేకాకుండా, ప్ర‌తి రోజు రాత్రి 11:30 నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు వాట్స‌ప్ సేవ‌ల‌ను నిలిపేయాలంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింద‌ని, ఆ ఆదేశాల‌కు అనుగుణంగా వాట్స‌ప్ మెసేజ్‌లు నిలిపివేయ‌బ‌డ‌తాయంటూ ఫేక్ న్యూస్‌లో కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు పేర్కొన్నారు. ఇంకా, ఈ న్యూస్‌ను వాట్స‌ప్‌ను ఎక్కువ‌గా వినియోగిస్తున్న వారు క‌చ్చితంగా ప‌ది మందికి ఫార్వార్డ్ చేయాల‌ని, అలా ఫార్వ‌ర్డ్ చేయ‌ని వారి ఖాతా నిలిపివేయ‌బ‌డుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫేక్ న్యూస్‌లో పేర్కొన్నారు. ఇలా వైర‌ల్ అవుతున్న ఫేక్ న్యూస్‌ల‌లో ఇప్పుడు వాట్స‌ప్ న్యూస్ కూడా వ‌చ్చి చేరింది. ఇది పూర్తి అవాస్త‌వ‌మ‌ని, దీన్ని ఎవ‌రూ న‌మ్మొద్దంటూ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు.

whats app 1

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad