Home General బీసీల అభివృద్ధికి రూ.75వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం : వైఎస్ జ‌గ‌న్‌

బీసీల అభివృద్ధికి రూ.75వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం : వైఎస్ జ‌గ‌న్‌

మ‌రో రెండు నెల‌ల్లో ఏపీలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే జ‌రిగే తొలి అసెంబ్లీ స‌మావేశాల్లోనే బీసీ స‌బ్ ప్లాన్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పిస్తామ‌ని ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ అన్నారు. అలాగే బీసీల కోసం ప్ర‌తీ ఏటా రూ.15వేల కోట్ల వంతున ఐదు సంవ‌త్స‌రాల్లో మొత్తంగా రూ.75 వేల కోట్ల‌ను ఖ‌ర్చు చేస్తామ‌ని వైఎస్ జ‌గన్ మోహ‌న్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. కాగా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు కేంద్రంగా ఇవాళ వైసీపీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన బీసీ గ‌ర్జ‌న స‌భ‌లో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.

వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మైన కార్పొరేష‌న్ల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేసి అన్ని వ‌ర్గాల‌కు అమ‌లు చేస్తామ‌న్నారు. ప్ర‌తి సామాజిక‌వ‌ర్గంలోని విద్యార్థులు వారు చ‌దువుకున్నంత వ‌ర‌కు అండ‌గా వైసీపీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు కాబోయే ప్ర‌భుత్వం ఉంటుంద‌న్నారు. ఏలూరు వేదిక‌గా బీసీ డిక్ల‌రేష‌న్ ప్ర‌క‌టించిన జ‌గ‌న్ చెప్పిన మ‌రికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..

– బీసీ స‌బ్‌ప్లాన్ ప్ర‌వేశ‌పెట్టి చ‌ట్ట‌బ‌ద్ధ‌త
– బీసీల‌కు మూడో వంతు నిధులు ఖ‌ర్చు
– తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ స‌బ్‌ప్లాన్‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌
– ప్ర‌తి వ‌ర్గానికి ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు
– బీసీల్లోని 139 వ‌ర్గాల‌కు విడివిడిగా ప్ర‌త్యేక కార్పొరేష‌న్లు
– 45 ఏళ్లు నిండిన ప్ర‌తి బీసీ మ‌హిళ‌కు వైఎస్ఆర్ చేయూత‌కింద రూ.75వేలు
– హాస్ట‌ల్‌లో ఉండి చ‌దువుకునే ప్ర‌తి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు
– పిల్ల‌ల‌ను బ‌డికి పంపించిన ప్ర‌తి త‌ల్లికి ఏటా రూ.15వేలు
– ఔట్ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు వ‌చ్చేలా ప్ర‌త్యేక చ‌ట్టం
– నామినేటెడ్ ప‌ద‌వుల్లో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad