
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లాడిన సంగతి అందిరికీ తెలిసిందే. వీరు పెళ్లి చేసుకుని మూడేళ్లు అవుతున్నా ఇంకా పిల్లల గురించి ఎందుకు ఆలోచించడం లేదని ఇటీవల సోషల్ మీడియాలో ఒకటే రచ్చ సాగింది. అయితే అలాంటి వారందరితో పాటు తమ ఫ్యాన్స్‌కు కూడా విరూష్క అదిరిపోయే గుడ్ న్యూ్స్ను మోసుకొచ్చారు. తాము ఇద్దరు నుండి ముగ్గురు కాబోతున్నట్లు విరాట్ కోహ్లీ, అనుష్క చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం అనుష్క శర్మ గర్భం దాల్చిందని, దీనికి సంబంధించిన ఓ ఫోటోను విరాట్ కోహ్లీ తన సోషల్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఈ వార్తతో తమ కుటుంబంలో సంతోష వాతావతరణం నెలకొందని ఈ జంట ఆనందంతో ఉప్పొంగిపోతుంది. ఇక తమ బేబీ 2021 జనవరిలో వస్తున్నట్లు విరాట్ తెలిపాడు. ఈ వార్తతో అటు విరాట్, అనుష్కల కుటుంబ సభ్యులతో పాటు వారి అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు.
అయితే కొంతమంది ఈ వార్తపై తమదైన సెటైర్లు కూడా వేస్తున్నారు. మొత్తానికి ఈ లాక్డౌన్ బాగానే పనికొచ్చిందంటూ కొందరు అంటుంటే.. తెలుగు హీరోలు రామ్ చరణ్, నాగచైతన్యల సంగతేమిటి అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా తొలిసారి తల్లిదండ్రులు కాబోతున్న విరాట్ కోహ్లీ, అనుష్కశర్మలకు వారి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.