Home General బిగ్ బ్రేకింగ్ : విమానంలో ఆక్సిజన్ నిలిపేసి 238 ప్రయాణికుల హత్య..!

బిగ్ బ్రేకింగ్ : విమానంలో ఆక్సిజన్ నిలిపేసి 238 ప్రయాణికుల హత్య..!

సుర‌క్షితంగా వారి వారి ప్రాంతాల‌కు చేరుకోవాల‌ని విమాన ప్ర‌యాణం చేసిన వారి ప్రాణాలు అనూహ్య రీతిలో గాల్లో క‌లిశాయి. ప్ర‌యాణ స‌మ‌యంలో త‌మ దేవుడిగా భావించిన వ్య‌క్తే చివ‌ర‌కు వారిప‌ట్ల య‌ముడిగా మారాడు. ఏకంగా ఆక్సీజ‌న్‌ను స‌ర‌ఫ‌రాను నిలిపివేసి చావుకు ముందే న‌ర‌క‌యాత‌న చూపించాడు. ఆఖ‌ర‌కు ప్ర‌యాణికుల అస్థిక‌లు వారి బంధువుల‌కు కూడా దొర‌క‌కుండా, ఎవ‌రికీ అంతు చిక్క‌ని ప్రాంతంలో విమానాన్ని కూల్చేశాడు. ఇదేదో ఇంగ్లీసోడు తీసిన క్రైమ్ అండ్ థ్రిల్ల‌ర్ సినిమా అనుకుంటే మీరు పొర‌పాటు ప‌డ్డ‌ట్టే. నిజ జీవితంలో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న ఇది.

ఇంత‌కీ ఈ సంఘ‌టన ఎక్క‌డ జ‌రిగింది..? ఎంత‌మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించారు..? ప్ర‌యాణికులు దేవుడిగా భావించిన ఆ వ్య‌క్తి ఎవ‌రు..? విషాదంగా ముగిసిన ఈ య‌దార్థ సంఘ‌ట‌న ఎలా ముగిసింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

అయితే, 2014 మార్చి 8న ఎంహెచ్370 (MH370) మ‌లేషియా విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బ‌య‌ల్దేరిన స‌మ‌యంలో నిర్దేశిత ప్ర‌దేశానికి చేరుకోక ముందే అదృశ్య‌మైన విష‌యం తెలిసిందే. 238 మంది ప్ర‌యాణికులు ఉన్న ఆ విమాన ఆచూకీని తెలుసుకునేందుకు ప్ర‌పంచ దేశాలుసైతం ఏక‌మై గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి. అయినా ఫ‌లితం లేక‌పోవ‌డంతో చొర‌వ తీసుకున్న ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌త్యేక నిపుణుల క‌మిటీని నియ‌మించింది.

MH370 మలేషియా విమానం అదృశ్యం వెనుక దాగి ఉన్న అస‌లు మ‌ర్మాన్ని క‌నిపెట్ట‌డంపై దృష్టిసారించిన ప్ర‌త్యేక నిపుణుల బృందానికి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిశాయి. దీంతో విమానం అదృశ్య‌మ‌య్యేందుకు, ఫ్లైట్‌లోని 238 మంది ప్రయాణికుల మృతికి ప్ర‌ధాన కారణం విమానం న‌డిపే ఫైలెట్ జహారీ అహ్మద్ షానేన‌ని వారు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. ఫైలెట్ మాన‌సిక స్థితి బాగులేనందునే ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింద‌ని, ఈ విష‌యం ఫైలెట్ బంధువులు, స్నేహితుల ద్వారా త‌మ‌కు తెలిసింద‌ని నిపుణుల బృందం తెలిపింది.

అంత‌కు ముందు కొన్నినెల‌లుగా ఒంట‌రి త‌నంతో మాన‌సిక స్థితిని కోల్పోయిన పైలెట్ ప్ర‌మాద స‌మ‌యంలో త‌న ప‌క్క‌నే ఉన్న కో పైలెట్‌ను హ‌త్య‌చేసి ఉండొచ్చ‌ని నిపుణుల బృంధం అభిప్రాయ‌ప‌డింది. అలా కాకుంటే క్యాబిన్‌లో ప‌రిస్థితి ఎలా ఉందో.. చూసొస్తా..అంటూ కాక్‌పీట్ త‌లుపులు మూసేసి ఆ త‌రువాత ఆక్సీజ‌న్ శాతాన్ని పూర్తిగా త‌గ్గించేసి ఉంటాడ‌ని, దీంతో కొద్ది సేప‌టికే ఆక్సీజ‌న్ లెవ‌ల్స్ పూర్తిగా ప‌డిపోవ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఊపిరాడ‌క 238 మంది ప్ర‌యాణికులు మ‌ర‌ణించి ఉంటార‌ని వారు చెప్పుకొచ్చారు.

కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వైపు బ‌య‌ల్దేరిన ఈ విమానం నిర్దేశిత ప్ర‌దేశం వైపు వెళ్ల‌కుండా, ఒక్క‌సారిగా 40 వేల అడుగుల ఎత్తుకు ఎగిరింద‌ని, అక్క‌డి నుంచి యూట‌ర్న తీసుకుని కూలిన‌ట్టు నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే కూలిన ఆ విమాన శ‌క‌లాలు ఎక్క‌డ ప‌డ్డాయో అన్న విష‌యంపై ఎటువంటి స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఐక్య‌రాజ్య స‌మితి నియ‌మించిన నిపుణుల బృందం సైతం ఆ విమానం ఆచూకీ కోసం చేప‌ట్టిన ద‌ర్యాప్తును ఆపేసింది. దీంతో ఈ సంఘ‌ట‌న మిస్ట‌రీగానే మిగిలింది. ఏదేమైనా విమానంలోని బ్లాక్ బాక్స్‌లు దొరికితేకానీ ఆ రోజున ఏం జ‌రిగింద‌న్న‌ది తెలియ‌ద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad