
పెళ్లయిన తరువాత మహిళలు అమ్మగా మారాలని చాలా ఆతృతగా ఉంటారు. అయితే కొందరి కడుపు పండినా, మరికొందరు మాత్రం అమ్మలుగా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. వారిలో చాలా మంది అమ్మతనం కోసం తమ భర్తలతో పలుమార్లు శృంగారంలో పాల్గొంటున్నారు. అయినా వారికి అమ్మతనం అందని ద్రాక్షగానే మారుతుంది.
కాగా ఇలాంటి వారి కోసం నిపుణులు ఓ శుభవార్తను తీసుకొచ్చారు. ఒకే రాత్రి రెండుసార్లు శృంగారంలో పాల్గొనే వారికి పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కవ ఉంటాయని తాజాగా ఓ పరిశోధనలో తేలిందట. రెండోసారి రతిక్రీడలో పాల్గొన్నప్పుడు పురుషుడు స్కలించే వీర్యం చాలా శక్తివంతంగా ఉంటుందనిన పరిశోధకులు అంటున్నారు. రాత్రివేళ ఒకసారి శృంగారంలో పాల్గొన్నాక, తిరిగి మూడు గంటల గ్యాప్ తరువాత మరోసారి శృంగారంలో పాల్గొంటే మెరుగైన పిండం ఏర్పడే అవకాశం ఉందని వారు వెల్లడించారు.
రెండో సారి శృంగారం చేసినప్పుడు సక్కలించే వీర్యంలో ప్రొటీన్ అధికంగా ఉంటుందని, పిల్లలు పుట్టేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు తెలిపారు. పిల్లలు కావాలనుకునే వారు ఈ విధంగా ఒకసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని పరిశోధకులు వెల్లడించారు. అలా అని అదే పనిగా రతిక్రీడలో ఉండటంత కూడా ఆరోగ్యానికి మంచిది కాదని వారు హెచ్చరిస్తున్నారు.