Home General తిరుపతిలో కలకలం..!

తిరుపతిలో కలకలం..!

తిరుపతిలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినులు ఈ రోజు తెల్లవారుజామున స్కూల్ కి వెళ్తున్నామ‌ని చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి అదృశ్య‌మైన సంఘ‌ట‌న కలకలం రేపుతోంది. అయితే బాలికల సంరక్షణ అధికారులు, స్కూల్ లోని అధికారులు కూడా ఉపాధ్యాయులు అందరూ కలిసి తిరుపతి పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికలు ఉంటున్న హాస్టల్ లో తనిఖీలు చేశారు. పోలీసుల త‌నిఖీల్లో ఒక లెటరు కూడా దొరికింది. అంతేకాకుండా ఆ హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను కూడా విచారించారు. కానీ అక్కడి విద్యార్థులు తమకి ఏమీ తెలియదని చెప్పారు. ఆ లెట‌ర్‌లో తాము హాస్టల్ లో నుంచి వెళ్లిపోయేందుకు నిర్ణ‌యించుకున్నామ‌ని విద్యార్థులు రాసి ఉండ‌టాన్ని పోలీసులు గుర్తించారు.

ఈ ముగ్గురు విద్యార్థులు 14, 15 ఏళ్ల వ‌య‌స్సు క‌ల‌వార‌ని, వారిలో ఒకరు అనంతపురంకు, మరొకరు కడపకు చెందినవారు. సాయిప్రియ అనే అమ్మాయి మాత్రం తిరుపతి కొర్లగుంటకు చెందిన అమ్మాయి గా పోలీసులు తెలిపారు. పోలీస్ లు మాత్రం పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. ఇప్ప‌టికే పోలీస్ లు తిరుపతి రైల్వే స్టేషన్ తో పాటు ఆర్టీసీ బ‌స్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. తప్పకుండా ఆ ముగ్గురు విద్యార్థినులు ఎక్కడున్నా ప‌ట్టుకుంటామ‌ని పోలీస్ లు చెప్పారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad