ప్రపంచ కప్లో భాగంగా భారత్ – ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన కొత్త జెర్సీలను ధరించనుంది. ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు నీలిరంగు జెర్సీలను ధరిస్తూ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఐసీసీ నిబంధనల ప్రకారం ఈ రెండు జట్లు తలపడనున్న మ్యాచ్లో టీమిండియా జెర్సీలు మారాయి. టీమిండియా కొత్త జెర్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కొత్త జెర్సీలను ధరించిన కోహ్లీ సేన ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్లో ఎలా కనిపిస్తారో తెలియజేస్తూ క్రికెట్ ప్రపంచకప్ ట్విటర్లో ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ జెర్సీలో ముదురు నీలం రంగుతోపాటు నారెంజ్రంగును కూడా జోడించారు. దీంతో ఈ ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.