Home General టీడీపీ - బీజేపీ సీన్ మ‌ళ్లీ రిపీట్‌..!

టీడీపీ – బీజేపీ సీన్ మ‌ళ్లీ రిపీట్‌..!

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితి టీడీపీ వ‌ర్సెస్ బీజేపీ అన్న‌ట్లుగా మారింది. అయితే, ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీ ప‌ర్య‌ట‌నను అడ్డుకుంటామంటూ సీఎం చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. వారికి ధీటుగా బీజేపీ శ్రేణులు కూడా మీడియా స‌మావేశాలు పెట్టిమ‌రీ టీడీపీకి వార్నింగ్‌లు ఇచ్చారు. ఆయ‌న దేశ ప్ర‌ధాని, దేశ ద్రోహి కాదు.. మోడీ పర్య‌ట‌నను ఎలా అడ్డుకుంటారో మేమూ చూస్తాం అంటూ బీజేపీ శ్రేణులు టీడీపీ నేత‌ల‌ను హెచ్చ‌రించారు.

అందులో భాగంగానే, శుక్ర‌వారం కాకినాడ‌లో ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబును బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. నీవు అవినీతి ప‌రుడ‌వు, నీ పాల‌న‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది అంటూ నినాదాలు చేస్తూ బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న నిర్వ‌హించారు.

ఈ నేప‌థ్యంలో కాకినాడ‌లో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను బీజేపీ అడ్డుకోవ‌డాన్ని నిర‌సిస్తూ ఇవాళ (శ‌నివారం) గుంటూరులోని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ ఇంటి ముందు టీడీపీ శ్రేణులు ధ‌ర్నాకు దిగారు. క‌న్నా ల‌క్ష్మీ నారాయ‌ణ‌కు వ్య‌తిరేకంగా, మోడీ డౌన్‌.. డౌన్ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న టీడీపీ శ్రేణుల‌ను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad