Home General నిత్యానందకు తమిళ వ్యాపారి ఆఫర్

నిత్యానందకు తమిళ వ్యాపారి ఆఫర్

Tamil Business Man Writes Letter To Nithyananda

ఆధ్యాత్మిక గురువుగా ఒక వెలుగు వెలిగిన నిత్యానంద స్వామీ, ఆ తరువాత పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఈ వివాదాల కారణంగా ఆయన దేవం వదిలి పారిపోయాడు. కాగా ఆయన సొంతంగా ‘కైలాస’ అనే దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిత్యానంద ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దేశానికి సంబంధించిన వార్తలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈక్వెడార్‌కు సమీపంలో ఓ ద్వీపంలో ఉంటున్న ఆయన, సొంతంగా ఓ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు, హిందువులా ఉండాలనుకునే వారు తన దేశంలో నివసంచవచ్చంటూ నిత్యానంద చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పటికే తన దేశానికి సంబంధించిన రాజ్యాంగం, విధివిధానాలను తాను ఏర్పాటు చేశానని, తన దేశానికి తానే ప్రధానమంత్రిని అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అయితే నిత్యానంద ఏర్పాటు చేస్తున్న దేశంలో తమిళనాడుకు చెందిన ఓ హోటల్ వ్యాపారి తన వ్యాపారాన్ని ప్రారంభిస్తానని, ఆయనకు లేఖ రాశాడు. మధురైలోని టెంపుల్ సిటీ పేరిట హోటళ్లను నిర్వహించే కుమార్ అనే వ్యాపారి కైలాస దేశంలో ఒక హోటల్‌ను ఏర్పాటు చేస్తానని, అక్కడి వచ్చే వారికి ఆహారంతో పాటు ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తానని ఈ లేఖలో పేర్కొన్నాడు.

మరి ఈ హోటల్ వ్యాపారికి నిత్యానంద గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేడో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ తమిళ తంబీ రాసిన లేఖ మాత్రం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఏదేమైనా నిత్యానంద ఏర్పాటు చేసిన కైలాస దేశం ఎలా ఉండబోతుందో ఒక్కసారైనా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad