Home General డెలివరీ బాయ్ లైగికంగా వేధించాడని మహిళ కంప్లైంట్ : రూ.200 కూపన్ తో సర్దుకోండి అన్న...

డెలివరీ బాయ్ లైగికంగా వేధించాడని మహిళ కంప్లైంట్ : రూ.200 కూపన్ తో సర్దుకోండి అన్న స్విగ్గీ

నేటి జనరేషన్ కు వంట చేసుకునే సమయం కూడా లేదు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది గుర్తించిన కొందరు వ్యాపారులు “ఫుడ్ డెలివరీ” అంటూ యాప్స్ తీసుకొచ్చి, ఒకేఒక్క క్లిక్ తో ఆర్డర్ ఇస్తే చాలు క్షణాల్లో మీకు కావల్సిన, మీకు నచ్చిన ఫుడ్ మీముందు ఉంటుంది. ఫుడ్ కోసం హోటల్స్ చుట్టూ తిరగకుండానే డైరెక్ట్ ఇంటికి వస్తుండడంతో ఈమద్య ప్రతి ఒక్కరూ “ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ” సంస్థల మీదే ఆధారపడుతున్నారు.

అలాంటి “ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ” సంస్థల వల్ల ఈమద్య లాభాల కంటే కష్టాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది లైంగిక వేదింపులు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన మహిళా ఒంటరిగా ఉంటే చాలు డెలివరీ బాయ్స్ రెచ్చి పోతున్నారు. ఫుడ్ డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఓ మహిళా పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఏం చేయాలో అర్దం కానీ ఆ మహిళా ఆ సంస్థకు ఫిర్యాదు చేస్తే.. రూ.200 కూపన్ పంపించి సర్దుకోండి అని సామదానం ఇచ్చారు. దాంతో ఏం చేయాలో తెలియని సదురు మహిళా తనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

ఈ పోస్టును ఓ ప్రముఖ పత్రిక బయటపెట్టింది. ఆ పత్రిక ప్రచూరించిన కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన ఓ మహిళ “స్విగ్గీ”లో ఫుడ్ ఆర్డర్ చేసింది. పార్శిల్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడం గమనించి లైంగికంగా వేధించాడు. మొదట మెల్లిగా ఏదో అన్నాడు. ఆమెకు అర్థంకాకపోవడంతో మళ్లీ చెప్పమని అడిగింది. అంతే వెనకముందు ఏం ఆలోచించకుండా వెంటనే సెక్స్ కావాలని అనేశాడు. దాంతో షాక్ కు గురైన సదురు మహిళా అతడి మొహం మీద డోర్ వేసి తప్పించుకుంది.

తరువాత స్విగ్గీ కస్టమర్ కేర్‌ కు ఫోన్ చేసి అతడి ప్రవర్తనపై కంప్లైంట్ చేసింది. దానికి స్పందించిన స్విగ్గీ యాజమాన్యం కేవలం సారీ చెబుతూ రిప్లై ఇచ్చింది. అక్కడితో ఆగకుండా నష్టపరిహారం కింద రూ.200 కూపన్ పంపింది. దాంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. మీ సంస్థలో పనిచేస్తున్న ఒకవ్యక్తి నన్ను లైంగికంగా వేదించాడు అంటే నష్టపరిహారం పేరుతో రూ.200 కూపన్ పంపిస్తారా ? ఇదేనా మీరు మహిళలకు ఇస్తున్న మర్యాదా ? అంటూ స్విగ్గీ సంస్థను నిలదీస్తూ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు పెట్టింది ఆ మహిళా.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad