Home General ప్రియుడి పై యాసిడ్ దాడి.. ఆ తర్వాత ..!

ప్రియుడి పై యాసిడ్ దాడి.. ఆ తర్వాత ..!

తిరుపతి కోర్టుకు విడాకుల విషయంలో హాజరైనా డాక్టర్‌పై కొన్ని రోజుల క్రితం అతని దగ్గర పనిచేసిన నర్సు యాసిడ్ దాడికి పాల్పడింది. డాక్టర్‌పై యాసిడ్ పోసిన నర్సు వెంటనే ఆమె కూడా టాయిలెట్‌ లోకి చేరి మిగిలిన యాసిడ్‌ను తాగింది. వెంటనే అక్కడి పోలీసు సిబ్బంది రుయా ఆస్పత్రికి చికిత్సకై తరలించారు. యాసిడ్ గాఢత తక్కువగా ఉన్నందువలన వలన ప్రస్తుతం నర్సు, డాక్టర్‌ ల పరిస్థితి బాగానే ఉంది. ఎలాంటి ప్రమాదం లేదని అక్కడి డాక్టర్స్ బృందం తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం ..

తిరుపతిలో రమాదేవి ఆసుపత్రిలో 2015లో ఆదర్శ్‌రెడ్డి డాక్టర్‌గా చేస్తున్నపుడు అరుణకుమారి నర్సుగా పనిచేసింది. వీరిద్దరు అప్పటికే వివాహితులు. కానీ ఆసుపత్రిలో వీరిద్దరి మధ్య శారీరకమైన సంబంధం ఏర్పడింది. వీరి అక్రమ సంబంధానికి అడ్డుగానున్న అరుణ భర్తను తానే స్వయంగా చంపేసింది. ఆదర్శ్‌రెడ్డి పెళ్లి చేసుకుంటానని అరుణను నమ్మించాడు. అంతే ఇక డాక్టర్ సలహా మేరకు భర్తకు పాయిజన్ ఇంజెక్షన్‌ను ఇచ్చి చంపేసింది.

ఆ తరవాత అరుణ ఇంటికి అడ్డు అదుపు లేకుండా ఆదర్శ్ రెడ్డి రాకపోకలు సాగాయి. మెల్లిగా అతని వ్యవహారం కాస్త భార్యకు కూడా తెలిసి విడాకులకు అప్లై చేసింది. అరుణ ఒక్క దానితోనే కాకుండా చాలా మందితో అక్రమ సంబంధాలున్నాయని అరుణ చెప్పింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి ఆ తరువాత తిరుపతి నుండి ఆదర్శ్ ఉద్యోగం మానేసి బెంగళూరు వెళ్లిపోయాడంతో, ఎన్నో రోజులుగా అతని రాక కోసం ఎదురు చూస్తున్నానర్సు… కోర్టుకు విడాకుల వాయిదా కోసం వస్తున్నాడని తెలిసి కోర్టు ప్రాంగణంలో యాసిడ్‌తో దాడి చేసింది.

కానీ డాక్టర్ మాత్రం ఇంకోలా వాదిస్తున్నాడు. అరుణ పెళ్లి చేసుకోమని వెంటపడి వేధిస్తున్నట్లు చెప్పాడు. దానికి అంగీకరించని అతని పై కక్ష సాదిస్తుందని తెలిపాడు. భార్యతో విడాకులు వరకు వెళ్ళడానికి కారణం కూడా అరుణే అని వెల్లడించాడు. గతంలో ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదుచేసిందని చెప్పుకొచ్చాడు. ఆమె భాధ భరించలేకే బెంగుళూరు వెళ్లినట్లు ఆదర్శ్ వివరనిచ్చాడు. పోలీసులు ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. పోలీసులు అరుణ, ఆదర్శ్ చెప్పిన విషయాలలో ఎవరివి నిజమనే కోణం లో విచారిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad